ఇంట్రస్టింగ్... మోడీ మరో పేరు రివీల్ చేసిన పవన్!
అవును... అమరావతి పునఃనిర్మాణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మోడీ గురించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 2 May 2025 12:58 PMఅమరావతి పునఃనిర్మాణ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా వచ్చారు. తిరువనంతపురం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న ఆయనకు.. ఏపీ అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ తో పాటు మంత్రులు స్వాగతం పలికారు. అక్కడ నుంచి మోడీ హెలీకాప్టర్ లో వెలగపూడిలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు చేరుకున్నారు.
అక్కడ ఆయనకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సాదర స్వాగతం పలికారు. అనంతరం హెలీప్యాడ్ నుంచి ప్రధాని రోడ్డు మార్గంలో వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ధర్మవరం శాలువా కప్పి చంద్రబాబు సన్మానించారు. అనంతరం పవన్ తో కలిసి ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు. అనంతరం పవన్ ప్రసంగిస్తూ.. మోడీ మరో పేరు రివీల్ చేశారు.
అవును... అమరావతి పునఃనిర్మాణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మోడీ గురించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. అమరావతికి నేనున్నానని భరోసా ఇస్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. ఆయనను భవానీ మాత మరింత శక్తివంతున్ని చేయాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా మోడీకి ఉన్న మరో పేరును ఆయన రివీల్ చేశారు. ఇందులో భాగంగా.. మోడీ ఓ సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకు 'అనికేత్' అని పేరు పెట్టారని.. దానర్థం పరమ శివుడు, ఇల్లు లేనివాడు అని తెలిపారు. మన ప్రధాని మోడీ కుటుంబం లేనివాడని.. అయితే, 140 కోట్ల మంది ప్రజానికాన్ని తన కుటుంబ సభ్యులుగా భావించి ముందుకు సాగుతున్నారని అన్నారు.
ఈ సందర్భంగా... ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ ప్రజానికం తరుపున, అమరావతి రైతాంగం, ఆడపడుచుల తరుపున హృదయపూర్వక నమస్కారాలు తెలిపారు పవన్ కల్యాణ్.