మోడీ పోస్టుకు ఆ ఇద్దరే పోటీ.. ఆర్ఎస్ఎస్ అప్డేట్!
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి వచ్చే సెప్టెంబరు 17తో 75 సంవత్సరాల వయసు వస్తుంది. దీంతో ఆయ నను పదవి నుంచి తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది.
By: Tupaki Desk | 14 July 2025 3:45 AM ISTప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి వచ్చే సెప్టెంబరు 17తో 75 సంవత్సరాల వయసు వస్తుంది. దీంతో ఆయ నను పదవి నుంచి తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఇటీవల బీజేపీ మాతృ సంస్థ ఆర్ ఎస్ ఎస్‌లోనూ.. ఈ తరహా చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. 75 ఏళ్ల వయసు వచ్చాక.. పదవులు పట్టుకుని ఇంకా వేలాడడం కరెక్టు కాదని ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. ఇక, ఇప్పటి వరకు మోడీ చేసిన పనులు, తీసుకున్న చర్యలను గమనించినా.. 75 ఏళ్ల ఎఫెక్ట్ ఆయనను కూడా చుట్టుముడుతోంది.
బీజేపీ, ఆర్ ఎస్ ఎస్‌లలో కీలకంగా వ్యవహరించిన.. మురళీ మనోహర్ జోషి, ఎల్ కే ఆద్వాణీ, కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప వంటి కీలక నాయకులను మోడీ హయాంలోనే `వయసు 75` చూపిస్తూ.. పక్కన పెట్టారు. ఇప్పుడు తన దాకా వచ్చింది. ఈ క్రమంలో ఆయనంత ఆయన వ్యక్తిగతంగా తప్పుకొంటారో.. లేక ఆర్ ఎస్ ఎస్ జోక్యం చేసుకుని తప్పిస్తుందా? అనేది చూడాలి.ఇదిలావుంటే.. ఆర్ ఎస్ ఎస్‌లో దీనికి సంబంధించిన కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది.
మోడీ కనుక ప్రధాన మంత్రి పోస్టు నుంచి తప్పుకొంటే.. తర్వాత ఆ పదవిని చేపట్టే సామర్థ్యం ఉన్నవారు ఎవరు? అనే విషయంపై అంతర్మథనం చేపట్టారు. ఈ ఏడాది అక్టోబరు 2తో ఆర్ ఎస్ ఎస్ కూడా 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. దీంతో ఈ సంస్థకు కూడా చీఫ్‌ను ఎంపిక చేయాల్సి ఉంది. ఈ పరిణామాల క్రమంలో తాజాగా ఆర్ ఎస్ ఎస్ భేటీ అయి.. ఈ విషయంపై చర్చించినట్టు తెలిసింది. దీని ప్రకారం.. మోడీ పోస్టుకు ఇద్దరు కీలక నాయకుల పేర్లను ప్రతిపాదించారని తెలిసింది.
ఒకరు మహారాష్ట్రకు చెందిన ప్రస్తుత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. మరొకరు ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, ప్ర స్తుత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఇద్దరూ కూడా.. ఆర్ ఎస్ ఎస్ నుంచి వచ్చిన వారే. పైగా.. ఇద్ద రూ కూడా సీనియర్ మోస్టు నాయకులు, గతంలో బీజేపీకి జాతీయ స్థాయి నాయకత్వం కూడా వహించారు. వీరిద్దరూ ప్రస్తుతం మోడీ తర్వాత.. ప్రధాని పోస్టుకు పరిశీలనలో ఉన్నట్టు ఆర్ ఎస్ ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
అయితే.. అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటనా రాలేదు. కానీ.. మార్పు కనుక నిశ్చయం అయితే.. రాజ్‌నాథ్, గడ్కరీలలో ఒకరికి ఖచ్చితంగా పోస్టు దక్కే అవకాశం ఉంటుందన్న చర్చ అయితే.. ఆర్ ఎస్ ఎస్ తెరమీదికి తెచ్చింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
