Begin typing your search above and press return to search.

అమెరికాలో కొత్త వైరస్ కనుగొన్న శాస్త్రవేత్తలు... ఎంత ప్రమాధకారంటే...?

ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ వైరస్ తెరపైకి వచ్చినప్పటి నుంచీ ప్రపంచ వ్యాప్తంగా వైరస్ లకు సంబంధించిన వార్తలపై ఆసక్తి నెలకొంటుంది

By:  Tupaki Desk   |   8 Nov 2023 12:54 PM GMT
అమెరికాలో కొత్త వైరస్ కనుగొన్న శాస్త్రవేత్తలు... ఎంత ప్రమాధకారంటే...?
X

ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ వైరస్ తెరపైకి వచ్చినప్పటి నుంచీ ప్రపంచ వ్యాప్తంగా వైరస్ లకు సంబంధించిన వార్తలపై ఆసక్తి నెలకొంటుంది. పైగా... రెగ్యులర్ గా ప్రపంచంలో ఏదో ఒక మూల కొత్త కొత్త వైరస్ లకు సంబంధించిన వార్తలు తెరపైకి వస్తుండటంతో... వాటి వల్ల వచ్చే సమస్య, కలిగే వ్యాది లక్షణాలు, దాని తీవ్రత, తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొదలైన అంశాలపై చర్చ మొదలైపోతుంది. ఈ సమయంలో తాజాగా మరో కొత్త వైరస్ తెరపైకి వచ్చింది!

అవును... మొన్నటివరకూ కరోనా వైరస్ విజృంభించిన విధానం ప్రపంచ దేశాలను తీవ్రస్థాయిలో కలవరపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అమెరికాలో వాంపైర్ వైరస్‌ లు మొట్టమొదటి సారిగా కనుగొనబడ్డాయి. వీటిపై శాస్త్రవేత్తలు గతకొంతకాలంగా తీవ్రంగా పరిశోధనలు చేసి శాస్త్రీయంగా గుర్తించారు. ఇవి ప్రమాదకరమైన వైరస్ లని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ ప్రమాదకరమైన వైరస్‌ లు అమెరికాలోని మేరీల్యాండ్, మిస్సౌరీలోని మట్టి నమూనాలలో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే వీటి ఉనికి గురించి పరిశోధకులకు దశాబ్ధాలుగా తెలిసినప్పటికీ... ఇది సరికొత్త రకంగా మొదటిసారి మట్టి నమూనాలలో కనుగొనబడిందని అంటున్నారు. దీంతో వీటికి మొబైల్ జెనిటిక్ ఎలిమెంట్స్ అని నామకరణం చేశారు యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ బాల్టిమోర్ కౌంటీ పరిశోధకులు.

ఈ వాంపైర్ వైరస్‌ లు తమ జన్యువులను శరీరంలోని ప్రధాన కణాలలోకి పంపించడానికి సహాయకులుగా వ్యవహరిస్తాయని.. రెండు వైరస్‌ లు ఒకే సమయంలో శరీరంలోని కణాలకు సోకేలా ఇది దోహదపడుతుందని.. బ్యాక్టీరియా కణాల్లో చొచ్చుకుపోయి జనాలకు సోకినప్పుడు సహాయక వైరస్‌ లుగా మారుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇక్కడ మరో ప్రమాధకరమైన విషయం ఏమిటంటే... పందులలో కనుగొనబడిన ఇన్ ఫ్లుయేంజా వైరస్ నమూనాలు కొత్త జాతులుగా ఉత్పత్తి చెందినప్పుడు మరింతగా ప్రమాదం పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక.. ఈ వైరస్ వ్యక్తిలో సంభవించినప్పుడు కణాలకు దగ్గరగా ఉండాలి. అయితే.. ఇటీవలి పరిశీలనలో ఆధారిత వైరస్ ఈ సహాయక వైరస్‌ తో అతుక్కొని కనిపించినట్లు గుర్తించారట శాస్త్రవేత్తలు!

కాగా... ఈ వైరస్‌ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌ ని ఉపయోగించడం ద్వారా కనిపించాయని శాస్త్రవేత్తలు తెలిపారు. "జర్నల్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ మైక్రోబియల్ ఎకాలజీ"లో అక్టోబర్ 31న ప్రచురించబడిన ఒక అధ్యయనంలో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి!