Begin typing your search above and press return to search.

ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్!

అవును... ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆరెస్స్ ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది! ఇందులో భాగంగా.. ఆమెకు మద్యంతర బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరకారించింది.

By:  Tupaki Desk   |   8 April 2024 6:13 AM GMT
ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితకు బిగ్  షాక్!
X

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు.. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరింత చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవ్వడంతోపాటు.. పూర్తిగా రాజకీయ రంగు పులుముకుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో బీఆరెస్స్ ఎమ్మెల్సీ కవితకు ఈ కేసులో బిగ్ షాక్ తగిలింది!

అవును... ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆరెస్స్ ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది! ఇందులో భాగంగా.. ఆమెకు మద్యంతర బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరకారించింది. తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందున ఈ నెల 16 వరకూ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని రౌస్ అవెన్యూలోని సీబీఐ స్పెషల్ కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం... ఏప్రిల్ 4న తీర్పును రిజర్వ్ చేసింది.

ఇలా తన చిన్న కుమారుడి పరీక్షల కోసం కవిత దాఖలు చేసుకున్న మధ్యంతర బెయిల్ పిటిషన్ కు సంబంధించిన వాదనల సమయంలో.. ఆ పిటిషన్ ను ఈడీ వ్యతిరేకించింది. ఇందులో భాగంగా... ఆమెకు బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని.. సాక్ష్యాలు, ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని.. సాక్ష్యులను బెదిరించే అవకాశమూ ఉందని పేర్కొంది!

ఇదే సమయంలో... అప్రూవర్ గా మారిన కొంతమందిని ఆమె ఇప్పటికే బెదిరించారని.. దీనికి సంబంధించిన ఆధారలు తమ వద్ద ఉన్నాయని ఈడీ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఇదే సమయంలో... కవిత చిన్న కుమారుడు ఒంటరివాడు కాదని.. తన వద్ద తండ్రి, సోదరుడితో పాటు కుటుంబ సభ్యులు ఉన్నారని ఈడీ తెలిపింది. ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని మధ్యంతర బెయిల్ ను తిరస్కరించాలని కోరింది.

ఈ నేపథ్యంలో మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ ను తోసిపుచ్చుతూ సీబీఐ స్పెషల్ కోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు కవిత దాఖలు చేసిన సాధారణ బెయిల్ పిటిషన్‌ పైనఈ నెల 20న సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ మార్చి 15న కవితను అరెస్ట్ చేయగా.. మార్చి 26 నుంచి ఆమె తిహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే!