Begin typing your search above and press return to search.

ఎమ్మెల్సీ అనంతబాబుని తరిమికొట్టారు... టీడీపీ వీడియో వైరల్!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం ఎంత సంచలనం సృష్టించిందనేది తెలిసిన విషయమే.

By:  Tupaki Desk   |   2 April 2024 6:25 AM GMT
ఎమ్మెల్సీ అనంతబాబుని తరిమికొట్టారు...  టీడీపీ వీడియో వైరల్!
X

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం ఎంత సంచలనం సృష్టించిందనేది తెలిసిన విషయమే. ఈ క్రమంలో తాజాగా అతనికి సంబంధించినదని చెబుతూ టీడీపీ పోస్ట్ చేసిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రత్తిపాడులో ఈ ఘటన జరిగినట్లు ఆ ట్వీట్ లో తెలిపింది. దళితుల ఆగ్రహాన్ని అనంత బాబు చవిచూశారనేది ఈ ట్వీట్ లోని ప్రధాన సారాంశంగా ఉంది!

అవును.. దళిత సామాజికవర్గానికి చెందిన ఒక డ్రైవర్ ని చంపిన కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకి ఘోర పరాభవం ఎదురైందని తెలుస్తుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా అతడు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేయడాన్ని కాకినాడ జిల్లా ప్రజలు తీవ్రంగా తప్పుబట్టారని.. ఒక ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని చంపి.. దళితుల ఆరాధ్య దైవం అయిన అంబేద్కర్ కు పూలమాల ఎలా వేస్తావంటూ మండిపడ్డారని చెబుతున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకి సోమవారం రాత్రి నిరసన సెగ తగిలిందని.. ప్రత్తిపాడు వైసీపీ అభ్యర్థి వరుపుల సుబ్బారావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారానికి వచ్చిన అనంతబాబు.. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడమే ఈ సమస్యకు ప్రధాన కారణం అని అంటున్నారు.

ఈ సమయంలో అనంతబాబుని చుట్టుముట్టిన దళితులు... దళితులను చంపి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేస్తే ఊరుకుంటామా అని ఫైర్ అవ్వడంతో... అతను వెనక్కి తిరిగి వెళ్లిపోయాడని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో.. అనంతబాబు ముట్టుకోవడంతో అంబేద్కర్ విగ్రహం అపవిత్రమయ్యిందంటూ స్థానికులు ఆ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారని సమాచారం.

దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన టీడీపీ... "జగన్ రెడ్డి ప్రియ శిష్యుడు, దళితులని చంపి, డోర్ డెలివరీ చేసే గంజాయి డాన్ అనంత బాబుని, దళితులు తరిమి తరిమి కొట్టారు. ప్రత్తిపాడులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయటానికి ప్రయత్నించిన వైసీపీ డాన్ అనంతబాబుని, దళితులు ఊరి బయట వరకు తరిమి కొట్టటంతో, అక్కడ నుంచి పారిపోయాడు. జగన్ రెడ్డి గుర్తుంచుకో.. నీ పతనం చూసేది ఈ దళితులే.." అని విషయం వెల్లడించింది.