Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేలకు యాభై ఓట్లు కూడా రాలేదా...

లేటెస్ట్ గా చూస్తే మధ్యప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సొంత ఊళ్ళోనే ఓట్లు రాలేదు.

By:  Tupaki Desk   |   6 Dec 2023 3:45 AM GMT
ఎమ్మెల్యేలకు యాభై ఓట్లు కూడా రాలేదా...
X

ఎవరికైనా ఉన్న ఊరులోనే అసలైన బలం. అందుకే ఉన్న ఉన్న ఊరు కన్న తల్లి అని అంటారు. సొంత తల్లి ఎపుడూ ప్రేమను పంచుతుంది. ఉన్న ఊరు కూడా దానికి సమానం అని అర్ధం. అయితే కాలం మారుతోంది. రాజకీయ నేతలకు ఉన్న ఊరు సొంత ఊరే నో చెబుతోంది. ఇది చాలా కాలంగా జరుగుతోంది.

లేటెస్ట్ గా చూస్తే మధ్యప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సొంత ఊళ్ళోనే ఓట్లు రాలేదు. పట్టుమని యాభై ఓట్లు కూడా వారు తెచ్చుకోలేకపోయారుట. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ గా ఉన్న మాజీ సీఎం కమలనాధ్. అయితే ఆయన అన్నదాంట్లో వ్యంగ్యం లేదు. విమర్శ ఉంది.

అంతకంటే కూడా అనుమానంతో చెబుతున్నారా మాట. ఈ మాట అంటూ ఆయన ఈవీఎంల మీద అతి పెద్ద డౌట్ నే ఉంచారు. మా పార్టీ తరఫున నిలబడిన అనేక మంది ఎమ్మెల్యేలకు వారి సొంత ఊళ్ళలో యాభై ఓట్లు కూడా రాలేదు అంటే అర్ధమేంటి అని ఆయన నిలదీస్తున్నారు

ఎక్కడో ఏదో జరిగి ఉంటుందని కమలనాధ్ అభిప్రాయం. మా ఎమ్మెల్యేలు ఓటమికి ప్రత్యర్ధి పార్టీలు కాదు ఈవీఎంలే అన్నట్లుగా కమలనాధ్ విమర్శలు ఉన్నాయి. అసలు ఇదెలా సాధ్యం అని ఆయన ప్రశ్నించారు.

తమ పార్టీకి చెందిన ఓడిపోయిన ఎమ్మెల్యేలు అంతా వచ్చి తన దగ్గర ఈ విషయం చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారని ఆయన అంటున్నారు. అంటే ఈవీఎంలలో తేడా ఉందని అవి కాంగ్రెస్ అభ్యర్ధులనే పనిగట్టుకుని ఓడిస్తున్నాయని కమలనాధ్ అంటున్నారు.

ఆ సంగతి సరే కానీ ఓడించాలి అనుకుంటే తెలంగాణాలో కాంగ్రెస్ ఎలా గెలిచింది అన్నది కూడా ఆయనే చెబితే బాగుంటుందేమో. ఏది ఏమైనా ఓటమికి ఎవరూ తండ్రులు కారు. జీర్ణించుకోవడం బహు కష్టం. అందుకే ఇలా లేని పోని విమర్శలు చేసి వదిలించుకుంటున్నారా అన్నదే చర్చగా ఉంది. చూడాలి మరి దీని మీద కేంద్ర ఎన్నికల సంఘం ఏమంటుందో.