Begin typing your search above and press return to search.

గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి రానున్న ఎమ్మెల్యేలు!?

ఈనేపథ్యంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరతారని వార్తలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   4 Dec 2023 8:11 AM GMT
గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి రానున్న ఎమ్మెల్యేలు!?
X

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలు సాధించింది. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే మేజిక్ ఫిగర్ సొంతం చేసుకుంది. దీంతో అధికారం చేపట్టేందుకు సిద్ధమవుతోంది. దీంతో బీఆర్ఎస్ నుంచి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైనప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంది. ఇప్పుడు అదే బాటలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈనేపథ్యంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరతారని వార్తలు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారానికి దూరం కావడంతో ప్రతిపక్షంలో ఉండటం ఇష్టం లేక ఆయన పార్టీ మారినట్లు తెలుస్తోంది. వెంకటరావుతోపాటు ఇంకా పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. అధికారంలో లేకపోతే ఎమ్మెల్యేగా ఉన్నా ప్రయోజనం శూన్యమే అనే ఆలోచనలో వారు ఉన్నట్లు చెబుతున్నారు.

2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీచేసిన వెంకటరావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య చేతిలో పరాజయం పాలయ్యారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన సందర్భంలో రాహుల్ గాంధీతో కండువా కప్పుకుని కాంగ్రెస్ ల చేరారు వెంకటరావు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ వీరయ్యకే ఇవ్వడంతో మనసు చిన్నబుచ్చుకుని మళ్లీ బీఆర్ఎస్ గూటికే చేరారు. బీఆర్ఎస్ టికెట్ దక్కించుకుని విజయం సాధించినా పార్టీకి అధికారం దక్కకపోవడంతో మళ్లీ కాంగ్రెస్ లో చేరతారని సమాచారం.

దీనిపై కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఇంకా పలువురు బీఆర్ఎస్ నేతలు తమతో టచ్ లో ఉన్నారని పేర్కొంటున్నారు. పార్టీ మారేందుకు రెడీగా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా ప్రయోజనం లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరతామని చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో గతంలో కేసీఆర్ పలువురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుని దెబ్బతీసినందున అదే ఊపు ఇప్పుడు కాంగ్రెస్ లో కనిపిస్తోంది. చెరపకురా చెడేవు అన్నట్లు అప్పుడు కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఆయనకే కంటగింపుగా మారడం విశేషం.

కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చినందున కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకే నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో బీఆర్ఎస్ కు పెద్ద షాకే. వారి అహంకారమే వారిని అధికారానికి దూరం చేసిందనే ఆరోపణలు రావడం సహజమే. 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలను తమ గూటికి చేర్చుకున్న గులాబీ పార్టీకి ఇప్పుడు అదే పరిస్థితి ఎదురు కావడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. అధికారం ఉందని ఎగిరిపడిన బీఆర్ఎస్ కు ఇప్పుడు తగిన శాస్తి జరిగిందని అంటున్నారు.

బీఆర్ఎస్ కు ఇలా వ్యతిరేక ఫలితాలు రావడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి దక్కిన పరాభవం ఇప్పుడు బీఆర్ఎస్ కు దక్కడం గమనార్హం. ఏది ఏమైనా తెలంగాణలో అధికార మార్పిడి జరగడం ఆహ్వానించదగినదే. ఇవాళ సాయంత్రం సీఎల్పీనేత ఎన్నిక ముఖ్యమంత్రిని ఎన్నుకుని ప్రమాణ స్వీకారం చేస్తారని చెబుతున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజల ముందుకు వెళ్లి అధికారం దక్కించుకోవడంతో రాష్ట్రంలో సుపరిపాలన అందించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.