Begin typing your search above and press return to search.

భార్యకు టిక్కెట్ ఇవ్వలేదని... పార్టీకి సింగిల్ లైన్ రాజీనామా!

తాజాగా ఏపీలో కూడా ఒక సీనియర్ పొలిటీషియన్ విషయంలో ఇలానే జరిగిందని అంటున్నారు!

By:  Tupaki Desk   |   25 March 2024 2:17 PM GMT
భార్యకు టిక్కెట్  ఇవ్వలేదని... పార్టీకి సింగిల్  లైన్  రాజీనామా!
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాస్త బలమైన నేతలు.. విపరీతంగా డబ్బు నేతలతో పార్టీలకు ఒక సమస్య ప్రధానంగా ఉంటుంటుంది. అదే.. ఫ్యామిలీ ప్యాకేజ్! ఇందులో భాగంగా తనకు, తన కుమార్తె / కుమారుడికి, అల్లుడు / కోడలికి, కుదిరితే భార్యకు, అవకాశం ఉంటే వియ్యంకుడికి అంటూ పార్టీ అధినేతలకు ఫ్యామిలీ ప్యాకేజ్ ప్రపోజల్స్ ముందు పెడుతుంటారు చాలా మంది నేతలు. అయితే ఈ విషయంలో కొంతమంది నేతలు అవి దక్కించుకుంటారు కూడా!

ఫలితంగా... నిజంగా జెండా మోసిన కార్యకర్తలు అన్యాయం అయిపోతుంటారు. తాజాగా ఏపీలో కూడా ఒక సీనియర్ పొలిటీషియన్ విషయంలో ఇలానే జరిగిందని అంటున్నారు! ఆ సంగతి అలా ఉంచితే తాజాగా తన భార్యకు ఎంపీ టిక్కెట్ ఇవ్వలేదని.. ఎమ్మెల్యేగా ఉన్న ఆమె భర్త పార్టీని వీడారు. ఇప్పుడు ఈ సంఘటన రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఇది జరిగింది అస్సాంలో కాగా.. సదరు ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత!

అవును... తన భార్యకు లోక్ సభ టిక్కెట్ ఇవ్వలేదని అస్సాం ఎమ్మెల్యే భరత్ చంద్ర నారా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ లఖింపూర్ లోక్ సభ స్థానానికి ఉదయ్ శంకర్ హజారికాను తమ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే.. తన పార్టీ మాజీ కేంద్రమంత్రి అయిన తన భార్య రాణీ నారాకు ఈ టిక్కెట్ దక్కుతుందని భరత్ చంద్ర ఆశాభావం వ్యక్తం చేశారు! అయితే అలాజరగకపోయే సరికి హర్ట్ అయ్యారంట.

దీంతో తాను తక్షణమే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మల్లికార్జున్ ఖర్గేకు సింగిల్ లైన్ లో రాజీనామా లేఖలో తెలిపారు భరత్ చంద్ర. ఇదే సమయంలో అస్సాం కాంగ్రెస్ మీడియా సెల్ చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేశారు.

కాగా... కాంగ్రెస్ పార్టీలో ఢకుఖానా నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన భరత్ చంద్ర.. 2021 ఎన్నికల్లో నవోబోయిచా నుంచి ఆరోసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందు అసోం గణ పరిషత్ లో ఉన్నారు. ఈ రెండు పాటీల ప్రభుత్వాలలోనూ ఆయన క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు.