Begin typing your search above and press return to search.

ప్ర‌శాంతిరెడ్డి స్ట‌యిలే వేరు.. మారిని పొలిటిక‌ల్ తీరు ..!

ఒకవైపు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యురాలుగా ఉన్న ప్రశాంత్ రెడ్డి సాధారణంగా తన సిఫారసు లేఖలను ఉన్నత స్థాయి వర్గాలకు ఇచ్చుకోవచ్చు.

By:  Tupaki Desk   |   26 Jun 2025 3:00 AM IST
ప్ర‌శాంతిరెడ్డి స్ట‌యిలే వేరు.. మారిని పొలిటిక‌ల్ తీరు ..!
X

ఉమ్మడి నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యురాలు ప్రశాంతి రెడ్డి నియోజకవర్గంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి ఆమె తొలిసారి ఎమ్మెల్యే అయిన విషయం తెలిసిందే. అయినప్పటికీ నియోజకవర్గంలో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నారు. ప్రజలను కలుసుకోవడం అదేవిధంగా ప్రతి సోమవారం ప్రజా దర్బార్ నిర్వహించడం చేస్తున్నారు. తద్వారా ప్రజలకు చేరువయ్య దిశగా ఆమె అడుగులు వేస్తున్నారు.

ముఖ్యంగా పేదల సమస్యలపై స్పందిస్తున్న తీరు నభూతో అనే చెప్పాలి. ఇప్పటివరకు సుమారు 800 మందికి తమ సొంత సంస్థల్లోనే ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పించార‌ని పార్టీ నాయకులు తెలిపారు. ఇది ఒకటే కాదు ప్రజలకు అందుబాటులో ఉండటంలోనూ స్వయంగా అన్ని సమస్యలను ఆమె పరిశీలించడంలోనూ ముందున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో రాజకీయాలకు అతీతంగా సాగుతున్న ఈ కార్యక్రమాలు ప్రజల నుంచి మంచి ఫలితాన్ని రాబడుతున్నాయి.

ఒకవైపు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యురాలుగా ఉన్న ప్రశాంత్ రెడ్డి సాధారణంగా తన సిఫారసు లేఖలను ఉన్నత స్థాయి వర్గాలకు ఇచ్చుకోవచ్చు. కానీ ఆమెను కలిసి అడుగుతున్న పేదలకు కూడా సిఫార్సు లేఖలను ఇస్తున్నారు ఇది మరింతగా ఆమె గ్రాఫ్ ను పెంచేందుకు దోహదపడింది. ఇక రాజకీయ విమర్శలను దాదాపు పక్కన పెట్టేశారు. వాస్తవానికి టిడిపి ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో వైసిపి వర్సెస్ టిడిపి అన్నట్టుగా రాజకీయాల సాగుతున్నాయి.

కానీ ఈ నియోజకవర్గంలో మాత్రం దాదాపు వ్యక్తిగత అంశాలు, రాజకీయపరమైన విమర్శలకు అవకాశం లేకుండా కేవలం ప్రజా కోణంలోనే ప్రజాదృష్టిలోనే వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అందుకే ఎక్కడా దూకుడుగా విమర్శలు చేయడం. రాజకీయ వివాదాలకు కేంద్రంగా మారడం అనేది మనకు నియోజకవర్గంలో కనిపించడం లేదు. దీంతో ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గంలో ప్రశాంతతతో పాటు సమస్యలు కూడా పరిష్కారం అవుతున్నాయని ఓపెన్ డిబేట్లో ప్రజలు చెబుతుండడం విశేషం.