Begin typing your search above and press return to search.

తమిళనాడు సీఎం స్టాలిన్ కొత్త లుక్ వెనుక కథ

తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ రాజకీయాల్లో మాత్రమే కాదు, తన వ్యక్తిత్వంలోనూ ప్రత్యేకతను చూపుతూనే ఉన్నారు.

By:  Tupaki Desk   |   5 Sept 2025 2:00 PM IST
తమిళనాడు సీఎం స్టాలిన్  కొత్త లుక్ వెనుక కథ
X

తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ రాజకీయాల్లో మాత్రమే కాదు, తన వ్యక్తిత్వంలోనూ ప్రత్యేకతను చూపుతూనే ఉన్నారు. ఇటీవల ఆయన కనిపించిన స్టైలిష్ లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. రాజకీయ నేతలు సాధారణంగా గంభీరత, సాంప్రదాయ వేషధారణలోనే కనిపించడం మనకు అలవాటు. కానీ స్టాలిన్ మాత్రం సమయానుసారం తన డ్రెస్‌చాయిస్‌తోనూ, బాడీ లాంగ్వేజ్‌తోనూ యువతరాన్ని ఆకర్షిస్తున్నారు.

స్టాలిన్ ఫ్యాషన్ సెన్స్

స్టాలిన్ కేవలం ఒక రాజకీయ నాయకుడే కాదు, తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాషన్ ఐకాన్‌గానూ నిలుస్తున్నారు. తెల్లటి షర్ట్, స్టైలిష్ గాగిల్స్, కాన్పిడెంట్ లుక్స్ ఆయనకు కొత్త అందాన్ని తెచ్చిపెట్టాయి. వయసు పెరిగినా, స్టైల్ విషయంలో ఏ మాత్రం తగ్గేది లేదని చూపించారు.

సోషల్ మీడియాలో హల్‌చల్

సీఎం కొత్త ఫోటోలు బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో అభిమానులు వాటిని వైరల్ చేస్తున్నారు. "స్టాలిన్ లుక్స్ యంగ్ హీరోలకంటే తక్కువేమీ కాదు" అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆయన మోడర్న్ డ్రెస్ సెలెక్షన్, సింపుల్ అయినా క్లాస్‌గా కనిపించే ఆట్టిట్యూడ్ అందరినీ ఆకట్టుకుంటోంది.

స్టైల్ వెనుక రాజకీయ మెసేజ్?

రాజకీయ విశ్లేషకులు మాత్రం స్టాలిన్ కొత్త లుక్ వెనుక ఒక సైలెంట్ స్ట్రాటజీ ఉందని అంటున్నారు. సాధారణ ప్రజలకు చేరువ కావడమే కాకుండా, యువతరానికి "తమ సీఎం కూడా ఫ్యాషన్ విషయంలో ఎప్పటికీ ఫ్రెష్" అన్న మెసేజ్ ఇవ్వడమే లక్ష్యంగా ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.

నేతల్లో నూతన ట్రెండ్

ఇప్పటి రాజకీయాల్లో కేవలం ప్రసంగాలు, నిర్ణయాలే కాకుండా లైఫ్‌స్టైల్‌ కూడా ఓ శక్తివంతమైన కమ్యూనికేషన్‌ టూల్‌గా మారింది. స్టాలిన్ లుక్ అదే విషయాన్ని మరోసారి రుజువు చేస్తోంది. స్టైల్, సింప్లిసిటీ, కాన్ఫిడెన్స్ ఈ మూడు ఆయన ఇమేజ్‌ను మరింత బలోపేతం చేస్తున్నాయి.

భారతదేశంలో ఉంటే తమిళనాడు సంప్రదాయానికే ప్రాధాన్యం

ఇక తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ఆయన రాజకీయ వైఖరి, ప్రజలతో కలసిపోవడమే కాకుండా, ఆయన దుస్తుల శైలి కూడా ప్రత్యేకంగా కనిపిస్తుూ ఉంటుంది. స్టాలిన్ ఎప్పుడూ పంచకట్టులోనే కనిపించడం ఆ రాష్ట్ర సాంప్రదాయాన్ని గౌరవించే గుర్తు. దక్షిణ భారత రాష్ట్రాల్లో పంచకట్టు (వెసిటీ లేదా ధోతీ) అనేది కేవలం దుస్తి కాదు, అది సంస్కృతి, గౌరవం, గుర్తింపు. స్టాలిన్ దాన్ని ఎప్పటికీ వదలకపోవడం ద్వారా, తమిళ జీవన విధానానికి తాను అంకితమని చాటి చెబుతుంటారు.

సాధారణతలోనే ప్రత్యేకత

ప్రభుత్వ పదవి, రాజకీయ ఒత్తిళ్ల మధ్య కూడా స్టాలిన్ పంచకట్టును ఎంచుకోవడం ఆయన సాధారణతను చూపిస్తోంది. అది ఆయనను ప్రజలకి మరింత దగ్గర చేస్తోంది. “మనవాడే” అనే భావనను ఆయన దుస్తులు తేవడం విశేషం.