మిథున్‌రెడ్డి లైట్ తీసుకున్నారా.. ఏం జరిగింది..?
అంటే.. మద్యం కేసును మిథున్ రెడ్డి లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. పెద్దగా సీరియస్‌గా దీనిని భావించ డం లేదు.
By: Tupaki Desk | 27 July 2025 6:00 PM ISTసహజంగా ఒక అరెస్టు నాయకులను తీవ్రంగా కుదిపేస్తుంది. నాయకులు సైతం అంతర్మథనంతో ఇబ్బం ది పడతారు. పైకి అక్రమ కేసు అన్నా.. సక్రమ కేసు అన్నా కూడా.. నాయకులు జైలుకు వెళ్లడం అనేది హనీమూన్ అయితే కాదు. వారికి సంబంధించిన ప్రభావం నియోజకవర్గంపై ఖచ్చితంగా పడుతుంది. దీం తో నాయకులు అంతర్మథనంలో కూరుకుపోతారు. అయితే.తాజాగా మద్యం కుంభకోణంలో అరెస్టయిన వైసీపీ నాయకుడు ఎంపీ మిథున్ రెడ్డికి మాత్రం ఈ తరహా అంతర్మథనం ఎక్కడా కనిపించడం లేదు.
పైగా.. ఆయన జైల్లో హ్యాపీగా ఉన్నారంటూ.. స్వయంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పడం గమనార్హం. అంటే.. మద్యం కేసును మిథున్ రెడ్డి లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. పెద్దగా సీరియస్‌గా దీనిని భావించ డం లేదు. మరి దీనికి కారణం ఏంటి? అంటే.. రెండురకాల వాదనలు వినిపిస్తున్నాయి. 1) తనకు ఈ కేసులో ఏమీ కాదన్న ధీమా: ఎందుకంటే.. మద్యం కుంభకోణం.. జరిగి ఉంటే..(జరిగిందని సిట్ చెబుతోం ది).. ఖచ్చితంగా దీనివెనుక ఉన్న పెద్దలు కూడా బయటకు వస్తారు. అలాంటప్పుడు.. తనకు జరిగే నష్టం ఏం ఉంటుందన్న కోణంలో మిథున్ రెడ్డి ఉన్నారు.
2) తనను అన్యాయం అరెస్టు చేసి.. జైల్లో పెట్టారన్న భావన: ఈ భావన సహజంగానే జైలుకు వెళ్లిన నాయ కులకు ఉంటుంది. తమను అక్రమంగా అరెస్టు చేశారని.. అన్యాయంగా జైలుకు తరలించారని వారు చెబు తారు. అంతేకాదు.. ఇది మున్ముందు తమకు సెంటిమెంటుగా కూడా ఉపయోగపడుతుందని వారు భావి స్తారు. ఇదే తరహాలో మిథున్ రెడ్డి కూడా ఆలోచన చేస్తున్నారన్న వాదన ఉంది. అందుకే.. ఆయన ప్రస్తు త పరిణామాలను లైట్ తీసుకున్నారని తెలుస్తోంది. అయితే..ఈ కేసును మరింత వేగంగా విచారించేం దుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
ఇదే జరిగితే.. మిథున్ రెడ్డి.. మరింత ఇరకాటంలో పడే అవకాశం ఉంటుంది. అలాగని.. ఇప్పటికిప్పుడు కేసులు తేలిపోతాయని కాదు. కానీ, మిథున్ రెడ్డిని రాజకీయంగా క్షేత్రస్థాయిలో ఇరకాటంలోకి నెట్టడం ద్వా రా.. సర్కారు వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని నిర్ణయించుకుంటే.. మాత్రం అప్పుడు తిప్పలు తప్ప వు. అయినప్పటికీ.. తాను ఎంపీగా ఉన్నందున.. తనకు ఏమీ కాదన్న ధోరణిలోనే మిథున్ వ్యవహరిస్తున్నా రు. కానీ. ప్రస్తుతం మాత్రం పరిస్థితులు నర్మగర్భంగా ఉన్నా.. మున్ముందు.. తీవ్ర మయ్యే పరిస్థితి నెలకొంటుందని అంటున్నారు పరిశీలకులు.
