Begin typing your search above and press return to search.

తప్పుడు సమాచారం వ్యవహారం... ఫస్ట్ ప్లేస్ లో భారత్‌!

అవును... ఈ ఏడాది భారత్‌, అమెరికా, బ్రిటన్‌, మెక్సికో సహా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   26 Jan 2024 4:30 PM GMT
తప్పుడు సమాచారం వ్యవహారం... ఫస్ట్  ప్లేస్  లో భారత్‌!
X

తప్పుడు సమాచారం... ఇది అత్యంత ప్రమాదకరమైన విషయాల్లో ఒకటి. ప్రస్తుతం సోషల్ మీడియా విపరీతంగా వాడకంలోకి వచ్చిన తర్వాత... ఏది వాస్తవం, ఏది అవాస్తవం అనే విషయాలను నిర్ధారించుకుని కానీ ఒక క్లారిటీకి రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తప్పుడు సమాచారాల వల్ల ఎన్నో దారుణాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో... తప్పుడు సమాచారం వ్యవహారంలో భారత్ టాప్ ప్లేస్ లో ఉందని చెబుతుంది తాజా నివేదిక.

అవును... ఈ ఏడాది భారత్‌, అమెరికా, బ్రిటన్‌, మెక్సికో సహా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. దీంతో.. సుమారు 300 కోట్ల మంది ఈ ఎన్నికల్లో భాగంకానున్నారని తెలుస్తుంది. అయితే... తప్పుడు సమాచార వ్యాప్తి ఎన్నికలకు పెను ముప్పుగా పరిణమించిందని నివేదిక చెబుతుంది.

ఇందులో భాగంగా ప్రధానంగా ఎన్నికల సమయంలో తప్పుడు సమాచార వ్యాప్తి అనేది పెను ముప్పుగా పరిణమించిందని.. ఇది ఆయా దేశాల్లో ఎన్నికల ఫలితాలపైనా, ప్రజాస్వామ్య మనుగడపైనా తీవ్ర ప్రభావం చూపిస్తుందని... ప్రపంచ ఆర్థిక వేదికకు సంబంధించిన గ్లోబల్‌ రిస్క్‌ నివేదిక-2024 ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ సందర్భంగా... ఆర్థిక, రాజకీయ, పర్యావరణ, భౌగోళిక, సాంకేతిక తదితర 34 ముప్పులపై నివేదిక ర్యాంకులను ప్రకటించిన గ్లోబల్ రిస్క్ నివేదిక - 2024... తప్పుడు సమాచారం అతిపెద్ద ముప్పుగా ఉన్న దేశాల్లో భారత్‌ తొలిస్థానంలో ఉందని.. అమెరికా ఆరో స్థానంలో ఉండగా.. యూకే 11 స్థానంలో ఉందని వెల్లడించింది.

ఇదే క్రమంలో... ఎల్ సాల్వడార్, పాకిస్తాన్, సౌదీ అరేబియా, ఐర్లాండ్, రొమేనియా, చెకియా, సియెర్రా లియోన్, ఫ్రాన్స్, ఫిన్లాండ్ వంటి దేశాలు కూడా తప్పుడు సమాచార ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న ఇతర దేశాల జబితాలో ఉన్నాయి. ఇదే సమయంలో... ఈ ముప్పు రాబోయే రెండు సంవత్సరాలలో దేశం ఎదుర్కొంటున్న 34 ప్రమాదాలలో టాప్ 10లో ఒకటిగా పరిగణించబడుతుందని అంటున్నారు.

దీంతో తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చనే మాటలు వినిపిస్తున్నాయి! ఇదే సమయంలో ఈ విషయాలపై స్పందిస్తున్న నిపుణులు... అంటు వ్యాధులు, అక్రమ ఆర్థిక కార్యకలాపాలు, అసమానత, కార్మికుల కొరత దేశానికి పెద్ద ప్రమాదమో.. ఈ తప్పుడు సమాచారం అనే అంశం కూడా అంతేప్రమాదమని అభిప్రాయపడుతున్నారు.