ప్రపంచ సుందరి నిలిచిన విజేత ఏడాదంతా కిరీటం ఆమె వద్దేనా?
ప్రపంచం చూపు హైదరాబాద్ మహానగరం వైపు పడేలా చేయటంలో మిస్ వరల్డ్ పోటీలు అంతో ఇంతో సాయం చేశాయనే చెప్పాలి. ఈ పోటీల్ని వ్యతిరేకించే బ్యాచ్ ఎప్పుడూ ఉన్నదే.
By: Tupaki Desk | 31 May 2025 11:00 AM ISTప్రపంచం చూపు హైదరాబాద్ మహానగరం వైపు పడేలా చేయటంలో మిస్ వరల్డ్ పోటీలు అంతో ఇంతో సాయం చేశాయనే చెప్పాలి. ఈ పోటీల్ని వ్యతిరేకించే బ్యాచ్ ఎప్పుడూ ఉన్నదే. వారి వాదనల్ని.. విమర్శల్ని పక్కన పెడితే.. ఈ పోటీల గ్రాండ్ ఫైనల్ ఈ రోజు జరగనుంది. ఈ రోజు రాత్రి 9.30 గంటల వేళలో ఈ ఏడాది మిస్ వరల్డ్ టైటిల్ విన్నర్ ఎవరన్నది తేలుతుంది. దీంతో.. ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఇక్కడే ఒక ప్రశ్న చాలా మంది మదిలో మెదులుతుంది.
ప్రపంచ సుందరి పోటీల్లో విజేతగా నిలిచిన వారు ఏడాది మొత్తం వరల్డ్ టూర్ చేస్తారు. ఈ సందర్భంగా ఆమె ధరించే కిరీటం అసలైనదేనా? అని. ఈ విషయానికి వస్తే.. మొదట ఈ కిరీటం విలువ గురించి చెప్పాలి. మిస్ వరల్డ్ విజేతకు తొడిగే అందాల కిరీటాన్ని 18 క్యారట్ల గోల్డ్ తో చేశారు. ఈ కిరీటం మధ్యలో 62.83 క్యారట్ల డైమండ్ చుట్టూ 1770 చిన్న చిన్న వజ్రాలు పొదిగి ఉంటాయి.వీటన్నింటి బరువు 175.49 క్యారట్లు.
ప్రపంచ సుందరి విజేతగా నిలిచిన వెంటనే ఆమెకు గత ఏడాది విజేత కిరీటం పెట్టినా.. అది ఆమెతో ఉండదు. అంతేకాదు.. ప్రత్యేక కార్యక్రమాల్లో మాత్రమే అసలైన కిరీటాన్ని ఆమె ధరించే వీలు ఉంటుంది. మరి.. ప్రపంచ టూర్ లో ధరించే కిరీటం అసలైనది కాదు. ఆమె విజయానికి చిహ్నంగా విజేతకు రెప్లికా క్రౌన్ ను ఇస్తారు. అసలు కిరీటం మిస్ వరల్డ్ సంస్థ వద్దే ఉంటుంది.
ఈ పోటీల్లో పాల్గొనే వారు 17 ఏళ్ల నుంచి 27 ఏళ్ల లోపు వారే పోటీలకు అర్హులు. సో.. మిస్ వరల్డ్ పోటీల్లో విజేతగా నిలిచిన వారికి ప్రైజ్ మనీ తప్పించి.. అసలైన కిరీటం మాత్రం ఆ కొద్ది క్షణాలు.. ఆ తర్వాత ముఖ్యమైన సందర్భాల్లో మాత్రమే ఇస్తారు తప్పించి.. ఆమె వద్ద ఒరిజినల్ కిరీటం ఉండదు. ఇంతకూ ఈ కిరీటం ధర ఎంత ఉంటుందంటారు? అన్న సందేహం రావొచ్చు. దానికి సమాధానం సుమారు రూ.85 లక్షల వరకు ఉండొచ్చని చెబుతారు.
