Begin typing your search above and press return to search.

చెన్నైలో ప్రపంచ బ్లాక్ బ్యూటీ సూసైడ్!

పుదుచ్చేరికి చెందిన శంకరప్రియ అలియాస్ శాన్ రేచల్ (25) చిన్నతనంలోనే తల్లిని కోల్పోయింది.

By:  Tupaki Desk   |   14 July 2025 11:32 AM IST
చెన్నైలో ప్రపంచ బ్లాక్ బ్యూటీ సూసైడ్!
X

చెన్నై మహానగరంలో విషాదం చోటు చేసుకుంది. ఆరోగ్య సమస్యలు పట్టి పీడుస్తున్న వేళ..వాటితో పోరాడే శక్తి సన్నగిల్లిందో ఏమో కానీ.. మిస్ వరల్డ్ బ్లాక్ బ్యూటీ ఆత్మహత్య చేసుకున్న వైనం వెలుగు చూసింది. చిన్న వయసులోనే పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్న శాన్ రేచల్ సూసైడ్ షాక్ కు గురి చేస్తోంది. పుదుచ్చేరికి చెందిన ఆమె అధిక మోతాదులో బీపీ మాత్రల్ని వేసుకోవటం ద్వారా ఆత్మహత్య చేసుకున్నట్లుగా చెబుతున్నారు.

పుదుచ్చేరికి చెందిన శంకరప్రియ అలియాస్ శాన్ రేచల్ (25) చిన్నతనంలోనే తల్లిని కోల్పోయింది. నల్లటి ఛాయ ఉండటంతో ఆమెను చాలామంది పక్కన పెట్టేశారు. ఇలాంటి నేపథ్యంలో పెరిగిన ఆమె.. తన ప్రతిభతో మోడలింగ్ రంగంలో రాణించారు. ఏ నల్ల రంగు తనను చాలామందికి దూరం చేసిందో.. అదే వర్ణంతో ఆమె తన సత్తా చాటి ఎంతోమందికి దగ్గరయ్యారు

2020-21లో మిస్ పాండిచ్చేరి.. 2019లో మిస్ డార్క్ క్వీన్ తమిళనాడు టైటిళ్లను సొంతం చేసుకున్న ఆమె.. అదే ఏడాది మిస్ బెస్ట్ యాటిట్యూడ్ లాంటి టైటిళ్లను సొంతం చేసుకున్నారు. అంతేకాదు.. బ్లాక్ బ్యూటీ విభాగంలో మిస్ వరల్డ్ టైటిల్ నను సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. ఆమె కొంతకాలంగా కిడ్నీ సమస్యతో జిప్మర్ లో చికిత్స పొందుతున్నారు,

తాజాగా ఆమె అధిక మోతాదులో బీపీ ట్యాబ్లెట్లను తీసుకోవటం ద్వారా తనువు చాలించారు. ఆమె ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులు కారణమని భావిస్తున్నారు. ఫ్యాషన్ షోతో సహా పలు కార్యక్రమాల్ని నరి్వహించిన ఆమె.. ఆర్థికంగా నష్టపోయినట్లు చెబుతున్నారు. దీంతో.. ఆమె ఆత్మహత్య చేసుకొని ఉంటారని భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. మరిన్ని వివరాలు పోలీసు దర్యాప్తులో వెలుగు చూడనున్నాయి.