తర్వాతి మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ లోనేనా?
హైదరబాద్ మహానగరంలో జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ పోటీలు వచ్చే ఏడాది కూడా భారత్ లోనే నిర్వహించేందుకు అడుగులు పడుతున్నాయా? అంటే అవుననే మాట బలంగా వినిపిస్తోంది.
By: Tupaki Desk | 29 May 2025 10:45 AM ISTహైదరబాద్ మహానగరంలో జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ పోటీలు వచ్చే ఏడాది కూడా భారత్ లోనే నిర్వహించేందుకు అడుగులు పడుతున్నాయా? అంటే అవుననే మాట బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే 71వ ఎడిషన్ (2024) మిస్ వరల్డ్ పోటీల్ని ముంబయిలో నిర్వహించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది (2026)లోనూ భారత్ లోనే మిస్ వరల్డ్ పోటీల్ని నిర్వహిస్తే బాగుండన్న ఆలోచనలో మిస్ వరల్డ్ సంస్థ ఉన్నట్లుగా చెబుతున్నారు. దీంతో 73వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీలకు భారత్ నే ఎంపిక చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా భావిస్తున్నారు.
ఇందులో భాగంగా భారత్ లోని పది నగరాల్ని షార్ట్ లిస్ట్ చేసినట్లుగా చెబుతున్నారు. ‘‘ప్రస్తుతం జరుగుతున్న 72వ ఎడిషన్ కోసం దేశంలోని మరో పది రాష్ట్రాలు పోటీలో నిలిచాయి.తదుపరి ఎడిషన్ నిర్వహణ కోసం అడుగుతున్నాయి. కొన్ని దేశాలు కూడా ఆ రేసులో ఉన్నాయి’’ అని మిస్ వరల్డ్ సంస్థ చైర్ పర్సన్ జూలియా మోర్లే వెల్లడించారు. అయితే.. మరోసారి భారత్ లోనే మిస్ వరల్డ్ పోటీల్నినిర్వహించేందుకు నిర్వాహకులు సుముఖంగా ఉన్నట్లు సమాచారం.
స్పాన్సర్ షిప్ రూపంలో మిస్ వరల్డ్ సంస్థకు భారీగా ఆదాయం సమకూరుతోంది. దీనికి సంబంధించిన లెక్కలు రహస్యంగా ఉంచుతున్నారు. పోటీల నేపథ్యంలో సంస్థకు వస్తున్న ఆదాయం వందల కోట్ల రూపాయిల్లో ఉన్నట్లు చెబుతున్నారు. కొన్ని దేశాల్లో అయితే.. సదరు ఆదాయంలో వాటా ఇవ్వాల్సి వస్తుందని.. భారత్ లో ఆ సమస్య లేకపోవటంతో మిస్ వరల్డ్ సంస్థకు భారత్ పట్ల ప్రత్యేకంగా చూస్తున్నట్లు చెబుతుననారు.
గత ఏడాది.. ఈ ఏడాది పోటీలు నిర్వహిస్తున్న రాష్ట్రాలు సదరు సంస్థకు పూర్తిగా సహకరించటం.. పోటీల నిర్వహణ గౌరవంగా భావించటం పట్ల మిస్ వరల్డ్ సంస్థ సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. వివిధ ప్రదేశాలకు మిస్ వరల్డ్ పోటీదారులు పర్యటించిన సందర్భంగా చేపట్టిన డెవలప్ మెంట్ పనుల ఖర్చుల్ని రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుకుంది. అయితే.. ప్రాశ్చాత్య దేశాల్లో ఆ పరిస్థితి లేదు.
మిస్ వరల్డ్ కార్యక్రమాల్ని వ్యాపార కార్యక్రమంగా చూస్తున్నాయి. ఈ పోటీల సందర్భంగా అయ్యే ఖర్చును సదరు సంస్థే భరించాల్సిన పరిస్థితి ఉందని చెబుతున్నారు. అమెరికా.. యూరోప్.. యూకే లాంటి దేశాల్లో టూరిజం ఇప్పటికే బాగా డెవలప్ కావటంతో.. ఆ దేశాలు ఈ పోటీల్ని నిర్వహించేందుకు పెద్దగా ఆసక్తిని చూపటం లేదు. అందుకు భిన్నంగా మన దేశంలోని రాష్ట్రాల పరిస్థితి ఉంది.
మిస్ వరల్డ్ పోటీలతో తమ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు పొందటంతో పాటు.. టూరిజం డెవలప్ అవుతుందన్న ఆలోచనలో ప్రభుత్వాలు ఉన్నాయి. అందుకే ఈ పోటీల్ని ప్రమోట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా అటు రాష్ట్రాలు.. ఇటు మిస్ వరల్డ్ సంస్థలు రెండు తమకు ప్రయోజనం కలిగే పరిస్థితులు ఉండటంతో.. ఈ పోటీల్ని భారత్ లోనే నిర్వహించేందుకు వీలుగా ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.
