మిస్ వరల్డ్: తొలి రోజు నెంబర్ 1 మిస్ ఫిలిప్పీన్స్.. నంబర్ 2 మిస్ ఇండియా
తొలిరోజు జరిగిన ఈ పోటీలో పాల్గొన్న సుందరీమణుల వస్త్రధారణతో పాటు.. వారి బాడీ లాంగ్వేజ్.. చురుకుదనాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు.
By: Tupaki Desk | 11 May 2025 10:44 AM ISTఅందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మిస్ వరల్డ్ 2025 పోటీలు శనివారం హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో మొదలు కావటం తెలిసిందే. మొత్తం 109 దేశాలకు చెందిన సుందరీమణులు ఈ ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ దేశ కల్చర్ ఉట్టిపడేలా వస్త్రాల్ని ధరించి అందరిని ఆకట్టుకున్నారు. ప్రారంభ వేడుకల్లో పోటీదారులు తాము ధరించిన వస్త్రధారణకు అంతర్జాతీయ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు ర్యాంకులు కేటాయిస్తారు.
తొలిరోజు జరిగిన ఈ పోటీలో పాల్గొన్న సుందరీమణుల వస్త్రధారణతో పాటు.. వారి బాడీ లాంగ్వేజ్.. చురుకుదనాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఇందులో మిస్ ఫిలిప్సీన్స్ ప్రతినిధి నెంబరు వన్ స్థానాన్ని సొంతం చేసుకోగా.. నంబరు 2గా భారత కంటెస్టెంట్ నందితా గుప్తా నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ...
- మిస్ ఈక్వెడార్
- మిస్ వెనిజులా
- మిస్ బ్రెజిల్
- మిస్ కోట్ డిల్వోర్
- మిస్ థాయిలాండ్
- మిస్ ఫ్రాన్స్
- మిస్ వర్టోరికో
- మిస్ కొలంబియా
- మిస్ శ్రీలంక సుందరీమణులు నిలిచారు. మిస్ వరల్డ్ ప్రారంభ వేడుకల్ని ప్రపంచ వ్యాప్తంగా 145 దేశాలకు చెందిన ప్రజలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించినట్లుగా మిస్ వరల్డ్ నిర్వాహకులు చెబుతున్నారు.
