Begin typing your search above and press return to search.

వారి తల్లుల్లు, భార్యలు, కూతుళ్లు... మంత్రి రోజా నిప్పులు!

ఇదే సమయంలో బండారు అరెస్టును ఖండిస్తున్నట్లు ప్రకటించిన గంటా శ్రీనివాస్, అయ్యన్న పాత్రుడు, నారా లోకేష్ లను ఈ సందర్భంగా రోజా సూటిగా ప్రశ్నించారు.

By:  Tupaki Desk   |   3 Oct 2023 4:43 PM GMT
వారి తల్లుల్లు, భార్యలు, కూతుళ్లు... మంత్రి రోజా నిప్పులు!
X

తనపై టీడీపీ నేత, బండారు సత్యనారాయణ చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై తాజాగా మంత్రి రోజా స్పందించారు. ఇందులో భాగంగా... బండారు సత్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేస్తే దాన్ని రాష్ట్ర మహిళలు అంతా స్వాగతిస్తున్నారని, సంతోషిస్తున్నారని రోజా తెలిపారు. కానీ విచిత్రంగా... టీడీపీ నేతలు మాత్రం బండారు అరెస్టును ఖండిస్తున్నామని నిస్సుగ్గుగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో బండారు అరెస్టును ఖండిస్తున్నట్లు ప్రకటించిన గంటా శ్రీనివాస్, అయ్యన్న పాత్రుడు, నారా లోకేష్ లను ఈ సందర్భంగా రోజా సూటిగా ప్రశ్నించారు. మీమీ ఇల్లల్లోని తల్లులను, భార్యలను, పిల్లలను, కోడల్లను కూడా ఎవరైనా ఇలాగే మాట్లాడితే అప్పుడు కూడా ఊరుకుంటారా అని, మాట్లాడేవారికి మద్దతు పలుకుతారా అని నిలదీశారు.

ఏదైనా అంటే సినిమావాళ్లు అంటూ చులకనగా చూస్తారని ఆవేదన వ్యక్తం చేసిన రోజా... టీడీపీ పార్టీని పెట్టింది కూడా సినిమా యాక్టరే అని, నా ఎన్టీఆర్ అని.. అయినప్పటికీ సినిమావాళ్లంటే చులకనగా మాట్లాడటం తాను ప్రతిపక్షంలో ఉన్నప్పటినుంచీ చూస్తున్నానని... తన క్యారెక్టర్ గురించి ఎంత నీచంగా మాట్లాడిందీ రాష్ట్ర ప్రజలంతా చూస్తూనే ఉన్నారని రోజా గద్గద స్వరంతో తెలిపారు. కన్నిళ్లు పెట్టుకున్నారు.

కేవలం టీడీపీ నాయకుల ఇళ్లల్లో ఉన్నవాళ్లే ఆడవాళ్లా.. వైసీపీలో ఉన్న వాళ్లు ఆడవాళ్లు కాదా, వారికి ఫ్యామిలీస్ ఉండవా అని ఘాటుగా ప్రశ్నించిన రోజా... ఇలా ఎంతకాలం భరించాలని అడిగారు. ఇదే క్రమంలో "నీ భర్త ఇలా నా గురించి మాట్లాడినప్పుడు చెప్పుతీసుకుని కొట్టుంటే... మళ్లీ నీ మొగుడు ఇలాంటి మాటలు మాట్లాడడు" అని బండారు సత్యనారాయణ భార్యను సూటిగా సూచించారు రోజా!

ఇదే సమయంలో రేపు ఎవరైనా మా గురించి కూడా ఇలానే మాట్లాడితే మా పరిస్థితి ఏమిటని నిలదీస్తూ... ఆయన కోడలు, కూతురూ లాగి పెట్టి చెంపమీద కొట్టి ఉంటే మరళా ఇలాంటి ఆలోచనలు రావని రోజా సూచించారు. ఇదే సమయంలో "దాని పేరు" అంటూ బ్రాహ్మణిని ఉద్దేశించి అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలనూ రోజా ప్రస్థావించారు.

తనను బండారు నీచంగా మాట్లాడితే.. ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేస్తే ఖండించిన లోకేష్... ఈ రోజు తన భార్యకు కూడా అదే పరిస్థితి తెచ్చుకున్నారని అన్నారు. తాను హీరోయిన్ గా ఉన్నప్పుడు బ్రాహ్మణి చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఆమెకు జెడలు వేశానని రోజా ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఆమె చిన్నపిల్ల కాబట్టే ఎప్పుడూ విమర్శించలేదని తెలిపారు.

అలా ఆమెను చిన్నపిల్ల అని భావిస్తే... జగన్ ని సైకో అని అంటే... తాను ఎలా ఊరుకుంటానని రోజా ఫైరయ్యారు. అమెరికాలో చదువుకుంటే.. బాలకృష్ణ కూతురైతే అబద్ధాలు చెప్పొచ్చా అని నిలదీశారు. ఈ సందర్భంగా మహిళలపై అగౌరవంగా మాట్లాడేవారిని.. వారిని సమర్ధిస్తున్న వారినీ నిత్యం నిలదీస్తూనే ఉంటాను.. ప్రశ్నిస్తూనే ఉంటాను అంటూ రోజా ఫైరయ్యారు.

ఈ రోజు బండారు సత్యనారాయణను అరెస్ట్ చేశారని తాను వదిలేది లేదని... పరువు నష్టం దావా వేస్తానని.. మహిళల గురించి ఎవడైనా, తప్పుగా, చెత్తగా మాట్లాడితే వాళ్లందరికీ బుద్దొచ్చేలా అడుగులు వేస్తానని రోజా స్పష్టం చేశారు.