Begin typing your search above and press return to search.

సీటు విషయంలో ఫైర్ బ్రాండ్ రోజా సంచలన వ్యాఖ్యలు...!

ఇక వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఎన్నికలు జరిగే నాటికి ఆమె మంత్రిగా రెండేళ్ల పాటు అనుభవం గడిచిన వారు అవుతారు

By:  Tupaki Desk   |   18 Dec 2023 6:41 PM GMT
సీటు విషయంలో ఫైర్ బ్రాండ్ రోజా సంచలన వ్యాఖ్యలు...!
X

వైసీపీలో లేడీ ఫైర్ బ్రాండ్ ఎవరు అంటే ఠక్కున చెప్పే ఏకైక పేరు ఆర్కే రోజా. ఆమె విపక్షంలో ఉన్నపుడు టీడీపీ ప్రభుత్వం మీద అదే ఫైర్ తో రాజకీయంగా దూకుడు చేశారు ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఇక వైసీపీ ప్రభుత్వం వచ్చాక తొలివిడలో మంత్రి అవుతారు అనుకుంటే ఆమెకు దక్కలేదు. నాడు ఒకింత నిరాశకు ఆమె గురి అయినా సెకండ్ టెర్మ్ లో మినిస్టర్ కుర్చీ వరించింది.

ఇక వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఎన్నికలు జరిగే నాటికి ఆమె మంత్రిగా రెండేళ్ల పాటు అనుభవం గడిచిన వారు అవుతారు. ఆ మీదట రిజల్ట్స్ దాకా కూడా ఆమె మంత్రి పదవి ఉంటుంది కాబట్టి లాంగ్ టెర్మ్ మంత్రిగా ఉన్న ముచ్చట తీరినట్లే. సరే ఆ సంగతి పక్కన పెడితే 2024 ఎన్నికల్లో నగరి ఎమ్మెల్యే టికెట్ రోజాకు దక్కుతుందా లేదా అన్న చర్చ ఒక పక్కన జోరుగా సాగుతోంది.

రోజాకు బదులుగా అంటూ శ్రీశైలం దేవస్థానం చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి పేరు గట్టిగా వినిపిసోంది. దాంతో రోజా టికెట్ల విషయం మీద మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలే చేశారు. సీటు కష్టపడే వారికి తప్పకుండా వస్తుంది అని ఆమె అనడం విశేషం. తాము మంత్రులమని ఒక నియోజకవర్గం కాదు రెండు మూడు చోట్ల ప్రభావితం చేసే స్థితిలో ఉన్నామని ఆమె అంటున్నారు.

దాంతో పాటు తాను ఇచ్చిన హామీలు అన్నీ నగరి నియోజకవగంలో నెరవేర్చాను అని ఆమె అన్నారు. తనతో పాటు మరో రెండు మూడు సీట్లను గెలిపించే స్తోమత తమకు ఉందని కూడా ఆమె చెప్పుకున్నారు. ఇక సీటు రాలేదు అంటే ఆ తప్పు నాయకులదే తప్ప ముఖ్యమంత్రి జగన్ ది కాదు అని ఆమె స్పష్టం చేస్తున్నారు.

గత రెండేళ్ళుగా జగన్ చిన్నపిల్లలకు చెప్పినట్లుగా ప్రతీ ఎమ్మెల్యేలూ చెబుతూ వచ్చారని, కష్టపడి పనిచేయండి అని కూడా కోరారు అని గుర్తు చేశారు. తనకు అందరూ కావాలని ఎవరికీ దూరం చేసుకోను అని కూడా జగన్ అన్నారని ఆమె చెప్పారు. ప్రతీ గడపకూ తిరగాలని కూడా తమ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలకు జగన్ చెప్పారని అన్నారు.

ఈ నేపధ్యంలో నుంచి చూస్తే పార్టీ పరంగా సర్వేలు జరుగుతున్నాయని ఇక టికెట్ రాలేదు అంటే అది వారి సొంత తప్పిదం తప్ప జగన్ ది కాదు అని మంత్రి తేల్చేసారు. ఇక జగన్ మార్పుచేర్పులు ఏవైనా చేయాల్సి వచ్చినా ఆయా నాయకులను పిలిపించుకుని ఒకటికి రెండు మూడు సార్లు వారితో సమావేశాలు నిర్వహించి అన్నీ విడమరచి చెబుతున్నారని రోజా అన్నారు. వైసీపీలో ఎక్కడా గుడ్డిగా మార్పులు చేయడం లేదని కూడా రోజా అన్నారు. ఎంతో పకడ్బందీగా అన్నీ ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకుంటున్నారు అని అంటున్నారు.

మొత్తానికి జగన్ గురించి గొప్పగా చెబుతూనే రోజా తాను నగరి నియోజకవర్గానికి చాలా చేసాను అంటున్నారు. దాంతో ఆమె సీటు విషయంలో గ్యారంటీగానే టికెట్ అని భావిస్తున్నారు అంటున్నారు. ఇక రోజా అన్న మరో మాటను తీసుకుంటే మంత్రులకు రెండు మూడు చోట్ల పట్టు ఉంటుందని అంటున్నారు కాబట్టి ఆమెకు నగరి మార్చినా చంద్రగిరి టికెట్ అయినా ఇచ్చి సర్దుబాటు చేస్తారా అన్న చర్చ నడుస్తోంది.

ఆమె టీడీపీలో ఉన్నపుడు 2009లో చంద్రగిరిలో పోటీ చేసి ఓడినా మంచి స్థాయిలోనే ఓట్లు తెచ్చుకున్నారు. పైగా చంద్రగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఈసారి పోటీ చేయరు అని అంటున్నారు. ఆయన కుమారుడు మోహిత్ రెడ్డికి టికెట్ అంటున్నా మంత్రి కాబట్టి రోజాకు అక్కడ అడ్జస్ట్ చేసినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. సో రోజా మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్న ధీమాతో ఉన్నారు.