Begin typing your search above and press return to search.

ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాల అనంతరం కేటీఆర్ పరిస్థితి ఇది!

2024 లోక్ సభ ఎన్నికలకు ముందు జరిగిన అత్యంత కీలకమైన ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ లు ముగిసింది

By:  Tupaki Desk   |   1 Dec 2023 1:12 PM GMT
ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాల అనంతరం కేటీఆర్ పరిస్థితి ఇది!
X

2024 లోక్ సభ ఎన్నికలకు ముందు జరిగిన అత్యంత కీలకమైన ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ లు ముగిసింది. ఈ నెల మూడో తేదీ (ఆదివారం) ఫలితాలు విడుదల కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలింగ్ అనంతరం ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ సందర్భంగా విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలు తెలంగాణ రాష్ట్రలో సరికొత్త చర్చకు దారితీశాయి. ఈ సందర్భంగా కేటీఆర్ రియాక్షన్ వైరల్ గా మారింది.

అవును... తెలంగాణ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం ఎగ్జిట్ పోల్ ఫలితాలు హల్ చల్ చేశాయి. వీటిలో మెజారిటీ ఫలితాలు తెలంగాణలో కాంగ్రెస్ కు అత్యధిక స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్లు చెప్పగా.. మరికొన్ని సర్వే ఫలితాలు హంగ్ సర్కార్ కు అవకాశం ఉందని వెల్లడించాయి. కొన్ని ఫలితాలు మాత్రం బీఆరెస్స్ కు హ్యాట్రిక్ ఛాన్స్ ఉందని తెలిపాయి. దీంతో ఈ విషయంపై కేటీఆర్ రియాక్ట్ అయ్యారు.

ఇందులో భాగంగా.. తెలంగాణ ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలపై పై మంత్రి కేటీఆర్ సీరియ‌స్ అయ్యారు. ఒక‌వైపు ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌గానే మరోవైపు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించ‌డం ఏంట‌ని ఆయ‌న ప్రశ్నించారు. ఈ క్రమంలో... ఈ నెల 3న వెలువ‌డే ఫ‌లితాల్లో బీఆరెస్స్ కు 70కి పైగా సీట్లతో మూడోసారి అధికారంలోకి వ‌స్తుంద‌ని తెలిపారు!

ఈ సందర్భంగా ఫలితాల అనంతరం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినవారు, ఆయా న్యూస్ ఛానళ్లూ క్షమాపణలు చెబుతాయా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా బీఆరెస్స్ శ్రేణులకు పలు సూచనలు చేశారు. ఇందులో భాగంగా... ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలను న‌మ్మొద్దని.. ఎగ్జాట్ పోల్స్ మ‌న‌వైపే వుంటాయ‌ని.. బీఆరెస్స్ శ్రేణులు ధైర్యంగా వుండాల‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. బీఆరెస్స్ హ్యాట్రిక్ విజయం ఖాయమని అన్నారు.

ఈ నేప‌థ్యంలో కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఆస‌క్తిక‌రంగా వుంది. ఇందులో భాగంగా... చాలా రోజుల త‌ర్వాత ప్రశాంతంగా నిద్రపోయాన‌ని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇదే సమయంలో... ఎగ్జిట్ పోల్స్ పొలిటిక‌ల్ హీట్‌ ను పెంచొచ్చే కానీ, ఎగ్జాట్ పోల్స్ మాత్రం కచ్చితంగా శుభ‌వార్త అందిస్తాయ‌ని ఆయ‌న ట్వీట్‌ లో పేర్కొన్నారు.

కాగా... మ‌రోవైపు కాంగ్రెస్ నేత‌లు అధికారంలోకి వచ్చేసినట్లు భావిస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబ‌రాలు చేసుకోవ‌చ్చన్నట్లుగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పిలుపు కూడా ఇచ్చేశారు. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ సమయంలో... చాలా రోజుల త‌ర్వాత ప్రశాంతంగా నిద్రపోయాన‌ని కేటీఆర్ ట్వీట్ చేయ‌డం గమనార్హం!