Begin typing your search above and press return to search.

ప‌రిగెత్తించి.. ప‌రిగెత్తించి కొడ‌తా: లోకేష్‌, అనిత‌ల‌కు మంత్రి వార్నింగ్‌

వైసీపీ ఫైర్‌బ్రాండ్ మంత్రి, విశాఖ జిల్లా అన‌కాప‌ల్లి ఎమ్మెల్యే గుడివాడ అమ‌ర్నాథ్ రెచ్చిపోయారు. తీవ్ర వ్యాఖ్య‌ల‌తో టీడీపీ కీల‌క నేత‌ల‌పై హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.

By:  Tupaki Desk   |   28 Feb 2024 4:49 AM GMT
ప‌రిగెత్తించి.. ప‌రిగెత్తించి కొడ‌తా: లోకేష్‌,  అనిత‌ల‌కు మంత్రి వార్నింగ్‌
X

వైసీపీ ఫైర్‌బ్రాండ్ మంత్రి, విశాఖ జిల్లా అన‌కాప‌ల్లి ఎమ్మెల్యే గుడివాడ అమ‌ర్నాథ్ రెచ్చిపోయారు. తీవ్ర వ్యాఖ్య‌ల‌తో టీడీపీ కీల‌క నేత‌ల‌పై హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే, ఎస్సీ నేత వంగలపూడి అనితల‌ను 'ప‌రిగెత్తించి.. ప‌రిగెత్తించి కొడ‌తా' అని మంత్రి అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాయకరావుపే టలో మంగ‌ళ‌వారం రాత్రి నిర్వహించిన సభలో మంత్రి గుడివాడ అమర్నాథ్ వీరిద్దరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

వైసీపీ నేతలపై అధికారంలోకి వస్తే బదులు తీర్చుకుంటామంటూ లోకేష్ ఎర్ర‌ పుస్తకాల్లో రాసుకుంటున్నాడని, తమకు, తమ పార్టీ కార్యకర్తలకు పుస్తకాలు అవసరం లేదని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు. ఏదైనా తేడా వస్తే పరిగెత్తించి కొడతానని మంత్రి హెచ్చ‌రించారు. ముఖ్యంగా సీఎం జగన్‌, ఆయన భార్య భారతిపైన టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, మరోసారి ఈ తరహా వ్యాఖ్యలు చేస్తే పరిగెత్తించి కొట్టడం ఖాయమని వెల్లడించారు.

వంగ‌ల‌పూడి అనిత‌ గురించి తాను మాట్లాడితే ఆమె స్థాయి పెరుగుతుందని మంత్రి అన్నారు. ఇకపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని వ్యాఖ్యానించారు. అనిత, లోకేష్ ని తీసుకొచ్చి నియోజకవర్గంలో తిప్పిందని, దానివల్ల ప్రయోజనం ఏమీ లేదని మంత్రి అన్నారు. మాజీ ఎమ్మెల్యే అనిత కోసం మాట్లాడితే ఆవిడ స్థాయి పెరుగుతుందని, అది తనకు ఇష్టం లేదన్న అమర్నాథ్.. బాగా మాట్లాడాలని సూచించారు. సీఎం జగన్‌, ఆయన భార్య గురించి చాలా దారుణంగా మాట్లాడుతున్నారని, ఈ తరహా మాటలు మానుకోవాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో ఈ తరహా నేతలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

నిరుపేదలకు అండగా ఉండేలా గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే.. ప్రతిపక్షాలు మాత్రం అనవసర ఆరోపణలు చేస్తున్నాయని మంత్రి గుడివాడ‌ విమర్శించారు. టీడీపీ నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో పెద్దపెద్ద వాళ్లు ఆర్థికంగా లబ్ది పొందాలని, వైసీపీ ప్రభుత్వంలో నిరుపేదలకు మేలు జరుగుతోందని వెల్లడించారు.