పెళ్లి నరకం.. రూ. లక్ష జీతం వదిలి గుహలో జీవితం
ఆ కష్టాలను తట్టుకోలేక "వివాహం వద్దు, వైరాగ్యం ముద్దు" అంటూ నిరాశతో నిండిన జీవితాన్ని గడపలేక, నగరానికి దూరంగా ఒక గుహలో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఇంతకీ ఇతడు ఎవరు, అతడి నేపథ్యం ఏమిటో తెలుసుకుందాం.
By: Tupaki Desk | 12 Jun 2025 8:00 PM ISTపెళ్లి తర్వాత అతడి జీవితం మారిపోయింది. అతడికి నరకం కనిపించింది. దీంతో వైరాగ్యం బాటపట్టారు. వివాహం అంతటి ఇబ్బందిని ఎందుకు తీసుకొస్తుంది? ఈ ప్రశ్నలు మీకే కాదు, ఓ 35 ఏళ్ల యువకుడికి కూడా ఎదురయ్యాయి. అయితే అతడికి కేవలం ప్రశ్నలు మాత్రమే కాదు, ఆ బాధలను స్వయంగా అనుభవించాడు. ఆ కష్టాలను తట్టుకోలేక "వివాహం వద్దు, వైరాగ్యం ముద్దు" అంటూ నిరాశతో నిండిన జీవితాన్ని గడపలేక, నగరానికి దూరంగా ఒక గుహలో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఇంతకీ ఇతడు ఎవరు, అతడి నేపథ్యం ఏమిటో తెలుసుకుందాం.
- మిన్ హెంకాయ్ - చైనా యువకుడి వ్యథ
చైనా దేశానికి చెందిన మిన్ హెంకాయ్ అనే 35 సంవత్సరాల యువకుడు నెలకు లక్ష రూపాయల వేతనం వచ్చే ఉద్యోగాన్ని వదులుకున్నాడు. గత నాలుగు సంవత్సరాలుగా అతను నగరానికి దూరంగా ఒక గుహలో జీవిస్తున్నాడు. అతడి ప్రమేయం లేకుండానే బంధువులు అతడి ఆస్తులను విక్రయించినప్పటికీ, అతను వారిని ఏమీ అనలేదు. గతంలో అతడు చేసిన అప్పుల్లో కొన్నింటిని తీర్చినప్పటికీ, ఇంకా $42,000 అప్పులు అతడికి ఉన్నాయి. 35 సంవత్సరాల వయసు వచ్చినా అతడు వివాహం చేసుకోలేదు. దీనికి కారణం తెలియదు, అతను ఆ విషయాన్ని బయటపెట్టలేదు. అతను పెళ్లి చేసుకోకుండా, బంధువులకు దూరంగా, ఎక్కడో గుహలో నివసిస్తున్నాడు.అయితే, అతను పూర్తిగా ఆధునిక ప్రపంచానికి దూరంగా లేడు. అతను గుహలో కూడా స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్నాడు. అతడికి సోషల్ మీడియాలో ఖాతా ఉంది, దాని ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేయడం ద్వారా ఆదాయం సంపాదిస్తున్నాడు. సోషల్ మీడియాలో అతడిని దాదాపు 42,000 మంది అనుసరిస్తున్నారు.
-నిరాశకు గురిచేసిన ప్రేమ, బంధువులు
మిన్ హెంకాయ్ గతంలో ప్రేమ వ్యవహారం నడిపినట్లు తెలుస్తోంది. మొదట్లో అంతా బాగానే ఉన్నప్పటికీ, తర్వాత ఆమె తన అసలు రూపాన్ని చూపించడంతో అతను మోసపోయానని గ్రహించాడు. దీంతో నిరాశలో కూరుకుపోయాడు. అటు బంధువులు కూడా అతడిని ఆర్థికంగా వాడుకుని తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. ప్రేమికురాలు, బంధువులు ఇద్దరూ ఇబ్బంది పెట్టడంతో అతను అన్నింటినీ వదిలేసి, నాగరిక జీవనానికి దూరంగా, ప్రకృతికి అత్యంత దగ్గరగా జీవించడం మొదలుపెట్టాడు.
-ఈ సృష్టిలో నిజమైన ప్రేమ అనేది ఉండదు
"కొన్ని సందర్భాలలో మనం అన్ని సొంతం అనుకుంటాం. అన్ని మనవే అని భావిస్తుంటాం. వాటికోసం మన ప్రాణాలను కూడా ఇస్తుంటాం. అలాంటి ఆలోచన తప్పు. ఎందుకంటే ఈ సృష్టిలో నిజమైన ప్రేమ అనేది ఉండదు. ప్రతి ప్రేమ వెనుక స్వార్థం ఉంది. సొంత అవసరం ఉంది. అవసరం, స్వార్థం ఎప్పుడూ ప్రేమకు ప్రతిరూపాలు కాదు. అందువల్లే అటువంటి స్వార్థపూరితమైన ప్రపంచానికి.. అవసరాలతో నిండిన వ్యక్తులకు దూరంగా వెళ్లిపోయాను. ఇప్పుడు ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్నాను. నచ్చిన తిండి తింటున్నాను. ఇష్టం వచ్చిన చోటికి వెళుతున్నాను. నన్ను ఎవరు ప్రశ్నించలేరు. నన్ను ఎవరు వారించలేరు. జీవితాన్ని ఒక సార్ధక దిశగా తీసుకెళ్తున్నానని" మిన్ హెంకాయ్ తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నాడు.అతను చెప్పే మాటలు చాలామందికి నచ్చడంతో, అదే పనిగా వింటున్నారు. అయితే, కొంతమంది నెటిజన్లు అతడిని ఉద్దేశించి, "అందరి జీవితంలో ఇలా ఎందుకుంటుంది? నీ జీవితంలో జరిగినంత మాత్రాన మిగతావారి విషయంలో కూడా ఇలానే జరుగుతుందని ఎలా అనుకుంటావు?" అని ప్రశ్నిస్తున్నారు.
మిన్ హెంకాయ్ జీవితం ఒక విలక్షణమైన ఉదాహరణ. ప్రేమ, సంబంధాలు, వ్యక్తిగత సంతోషం గురించి అతను చేసిన నిర్ణయాలు సమాజంలో ఒక చర్చకు దారితీస్తున్నాయి. ఇది నిజంగా ఒక సార్థక జీవితమా లేక నిరాశతో కూడిన పలాయనవాదమా? మీ అభిప్రాయం ఏమిటి?
