Begin typing your search above and press return to search.

కొలంబియా అధ్యక్ష అభ్యర్థిపై కాల్పులు.. షాకింగ్ వీడియో!

కొలంబియా అధ్యక్ష అభ్యర్థి మిగ్యుల్ ఉరిక్ ఒక ప్రసిద్ధ రాజకీయ నాయకుడు, న్యాయవాది. జనవరి 28, 1986లో బొగోటాలో జన్మించిన ఉరిబ్.. రైట్ వింగ్ డెమోక్రటిక్ సెంటర్ పార్టీలో కీలక సభ్యుడిగా ఉన్నారు.

By:  Tupaki Desk   |   8 Jun 2025 9:35 AM IST
కొలంబియా అధ్యక్ష అభ్యర్థిపై  కాల్పులు.. షాకింగ్  వీడియో!
X

కొలంబియా సెనేటర్, అధ్యక్ష అభ్యర్థి, 39 ఏళ్ల మిగ్యూల్ ఉరిబ్ టర్బే పై హత్యాయత్నం జరిగింది. ఆయన ఓ పొలిటికల్ ర్యాలీలో ప్రసగింస్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తి ఆయనపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని కథనాలొస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

అవును... కొలంబియా అధ్యక్ష అభ్యర్థి మిగ్యూల్ ఉరిబ్ టర్బే.. శనివారం బొగోటా పార్కులో ఓ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన ఆ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తుండగా ఓ దుండగుడు ఆయనపై కాల్పులు జరిపాడు. ఈ సందర్భంగా చాలా రౌండ్లు కాల్పులు జరిపినట్లు వీడియోలో శబ్ధాల ద్వారా తెలుస్తోంది. ఈ విషయం ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపింది.

ఈ విషయాన్ని బొగోటా మేయర్ కార్లోస్ గాలన్ ధృవీకరించారు. ఈ సమయంలో.. కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్న ఓ వ్యక్తిని పట్టుకున్నట్లు తెలిపారు. మరోవైపు ఈ ఘటనను మిగ్యూల్ పార్టీ కంజర్వేటివ్ డెమోక్రటిక్ తీవ్రంగా ఖండించింది. ఇది రాజకీయ నాయకుడిపై దాడి కాదు.. దేశంలోని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని పేర్కొంది.

ఎవరీ మిగ్యుల్ ఉరిబ్ టర్బే?

కొలంబియా అధ్యక్ష అభ్యర్థి మిగ్యుల్ ఉరిక్ ఒక ప్రసిద్ధ రాజకీయ నాయకుడు, న్యాయవాది. జనవరి 28, 1986లో బొగోటాలో జన్మించిన ఉరిబ్.. రైట్ వింగ్ డెమోక్రటిక్ సెంటర్ పార్టీలో కీలక సభ్యుడిగా ఉన్నారు. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఆయన తల్లి డయానా టర్బే 1991లో జరిగిన ఓ రెస్క్యూ ఆపరేషన్ సమయంలో మరణించారు.

39 ఏళ్ల ఈ అధ్యక్ష అభ్యర్థి.. ప్రస్తుత అధ్యక్షుడు గుస్తావో పెట్రో నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఆయన బాగా ఫేమస్ అయినట్లు చెబుతారు. ఈ నేపథ్యంలో మాజీ ప్రెసిడెంట్ అల్వారో ఉరిబ్ బెలెజ్ తో ఆయన పొత్తు పెట్టుకుని రంగంలోకి దిగారు. ఈ విధంగా చిన్న వయసులోనే రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.

ఇందులో భాగంగా... 2012 - 2015 మధ్య బొగోటా నగర కౌన్సిలర్ గా పనిచేసిన ఆయన.. ఆ పదవిని నిర్వహించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కారు. ఇదే క్రమంలో 2014లో కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.