Begin typing your search above and press return to search.

పాకిస్తాన్ ను ఉగ్రవాద దేశంగా యూఎస్ ప్రకటించాలి....పెంటగాన్ మాజీ అధికారి రూబిన్

పాకిస్తాన్ ను పొగడటంలో యూఎస్ కు ఎలాంటి వ్యూహం లేదని పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ అన్నారు. పాక్ ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలి.

By:  Tupaki Desk   |   6 Dec 2025 5:57 PM IST
పాకిస్తాన్ ను ఉగ్రవాద దేశంగా యూఎస్ ప్రకటించాలి....పెంటగాన్ మాజీ అధికారి రూబిన్
X

పాకిస్తాన్ ను పొగడటంలో యూఎస్ కు ఎలాంటి వ్యూహం లేదని పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ అన్నారు. పాక్ ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలి. అలాగే అసిమ్ మునీర్ యూఎస్ కు వస్తే గౌరవించకండి...అరెస్ట్ చేయండి అని డిమాండ చేశారు. గతేడాది కాలంగా ట్రంప్ ప్రభుత్వం భారత్ తో వ్యవహరించిన తీరుకు క్షమాపణలు చెప్పాలని అన్నారు. ట్రంప్ కు ఇగో ఎక్కువని..అమెరికా ప్రయోజనకాలకంటే ట్రంప్ ఇగో పెద్దేం కాదని వ్యాఖ్యానిచారు. రూబిన్ గతంలోనూ పాకిస్తాన్ తీరును...అమెరికా వెనకేసుకొస్తున్న విధానాన్ని ఎండగట్టారు. భారత్ లో పెహల్గామ్ దాడి సందర్భంగా మైఖేల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్...బిన్ లాడిన్ ఇద్దరు ఒకటే. వీరిద్దరూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేవారే ...ఈ మాట అన్నది వేరెవరో కాదు సాక్షాత్ యూఎస్ పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్. పెహల్గామ్ పై టెర్రరిస్టుల దాడి నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ...యూఎస్ పాకిస్తాన్ ను ఆధికారికంగా ఉగ్రవాద మద్దతు దేశంగా ప్రకటించాలి అని డిమాండ్ చేశారు. యూఎస్ పాకిస్తాన్ ను ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేసే దేశంగా...పాకిస్తాన్ ఆర్మీచీఫ్ అసిమ్ మునీర్ ను ఉగ్రవాదిగా వెంటనే ప్రకటించాల్సిన అవసరం ఉందని మీడియాతో అన్నారు. బిన్ లాడెన్ గుహలో దాక్కొంటే...మునీర్ భవనంలో ఉన్నాడు వీరిద్దరి మధ్య వ్యత్యాసం అంతే అంటూ వ్యంగ్యంగా తెలిపారు.

పెంటగాన్ మాజీ అధికారి పాకిస్తాన్ కు సంబంధించి చాలా తీవ్రంగా వ్యాఖ్యానిస్తూ పందిని అలంకరించినంత మాత్రాన అది పంది కాకపోదుకదా. అలాగే పాకిస్తాన్ ను ఉగ్రవాద మద్దతు దేశం కాదన్నంత మాత్రాన అది కాకుండ పోదు అన్నారు. గతంలోనూ అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్ లో పర్యటించినపుడు టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. యూఎస్ పాకిస్తాన్ విషయంగా ఉపేక్షించడం ప్రమాదకరం. 2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్ పై చేసిన దాడులు...పెహల్గామ్ పై ఉగ్రవాదులు దాడులు ఈ రెండు కూడా ప్రశాంతంగా జీవిస్తున్న ప్రాంతాల వారిపై జరిగినవే. ఇజ్రాయెల్ లో లిబరల్ జూస్ ఇండియాలో మధ్యతరగతి హిందూలే ఈ దాడుల్లో నష్టపోయారని మైఖేల్ అన్నారు. ఇజ్రాయెల్ లో జూస్ పైనే కాదు లిబరల్ జూస్ ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. లిబరల్ జూస్ గాజా స్ట్రిప్ లో శాంతిని కోరుకునేవారే. అలాగే పెహల్గామ్ లో పర్యటనకు వచ్చిన హిందువుల పై దాడి విషయంలోనూ పాకిస్తాన్ ఇదే ట్రిక్ వాడిందని రూబిన్ విమర్శించారు.