Begin typing your search above and press return to search.

యూఎస్ లో వంతెనను ఢీకొన్న నేవీ నౌక... షాకింగ్ వీడియోలు!

న్యూయార్క్ లోని బ్రూక్లిన్ వంతెనను మెక్సికన్ నేవీ శిక్షణా నౌక ఢీకొట్టింది. ఈ ప్రమాదానికి సంబంధించిన పలు వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి

By:  Tupaki Desk   |   18 May 2025 1:50 PM IST
యూఎస్  లో వంతెనను ఢీకొన్న నేవీ నౌక... షాకింగ్  వీడియోలు!
X

న్యూయార్క్ లోని బ్రూక్లిన్ వంతెనను మెక్సికన్ నేవీ శిక్షణా నౌక ఢీకొట్టింది. ఈ ప్రమాదానికి సంబంధించిన పలు వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఓడకు సంబంధించిన మూడు మాస్ట్ ల పైభాగం ఐకానిక్ బ్రిడ్జ్ ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా.. సుమారు 19 మంది గాయపడ్డారు.

అవును... బ్రూక్లిన్ వంతెనను మెక్సికన్ నౌక ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. 19 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉందని చెబుతున్నారు. మెక్సికన్ నౌక తూర్పు నది గుండా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఓడలో సుమారు 277 మంది ఉన్నారని చెబుతున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్... ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, 19 మంది గాయపడ్డారని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా స్పందించిన మెక్సికన్ నేవీ... సుమారు 297 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పు గల అకాడమీ శిక్షణ నైక కువాటెమోక్ ఈ ప్రమాదంలో దెబ్బతిందని తెలిపింది!

ఇదే సమయంలో.. ఈ నౌక ప్రతీ సంవత్సరం మిలటరీ స్కూల్ శిక్షణ పూర్తి చేయడానికి బయలుదేరుతుందని చెబుతున్నారు. దీని తాజాగా.. ఏప్రిల్ 6న ఈ నౌక మొదలవ్వగా.. అక్కడ నుంచి కింగ్ స్టన్ (జమైకా), హవానా (క్యూబా), కోజుమెల్ (మెక్సికో), న్యూయార్క్ (అమెరికా) సహా 15 దేశాల్లోని 22 ఓడరేవులను సందర్శించాలని షెడ్యూల్ చేసుకుంది!