Begin typing your search above and press return to search.

సీఎం వైఫ్ చూయింగ్ గమ్ వ్యవహారం... మెస్సీ ఫ్యాన్స్ ఫైర్!

ఆమె సెల్ఫీకి వెళ్లిన సమయంలో మెస్సీ కాస్త అసౌకర్యంగా కనిపించాడని.. పైగా మెస్సీతో ఒకటికి రెండుసార్లు సెల్ఫీలు తీసుకునే ప్రయత్నం చేసి, అతడిని ఇబ్బంది పెట్టారని కామెంట్లు పెడుతున్నారు.

By:  Tupaki Desk   |   15 Dec 2025 3:58 PM IST
సీఎం వైఫ్  చూయింగ్  గమ్  వ్యవహారం... మెస్సీ ఫ్యాన్స్  ఫైర్!
X

భారతదేశ పర్యటనలో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంకు చేరుకుని, అభిమానులకు అభివాదం చేశారు అర్జెంటీనా ఫుట్ బాల్ క్రీడాకారుడు "జీఓఏటీ" లియోనెల్ మెస్సీ. ఇది అభిమానులకు ఊహించని క్షణం అనే చెప్పాలి. మెస్సీని దగ్గర నుంచి చూడటాన్ని అదృష్టంగా భావిస్తుంటారు అభిమానులు. ఈ సమయంలో మహారాష్ట్ర సీఎం భార్య వ్యవహారంపై మండిపడుతున్నారు.






అవును... ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీతో తాజాగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో వేదిక పంచుకున్నారు మహారాష్త్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత. ఈ సమయంలో ఆమె వ్యవహారశైలిపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి. ఇందులో భాగంగా... మెస్సీతో ఆమె వేదిక పంచుకున్న తీరు సరిగా లేదని పలువురు నెటిజన్లు ఫైరవుతున్నారు.

అసలేం జరిగిందంటే... తాజగా వైరల్ అవుతోన్న వీడియోలో.. మైదానంలో ఉన్న మెస్సీ వద్దకు అమృత ఫడ్నవీస్ వెళ్లారు. ఈ సమయంలో ఆమె చూయింగ్ గమ్ నములుతూ, ఆయనను గ్రీట్ చేస్తున్నట్లు కనిపించకుండా, సెల్ఫీలు తీసుకున్నారు! ఆ సమయంలో ఆమె ప్రవర్తన ఆటిట్యూడ్ చూపిస్తున్నట్లుగా ఉందని.. దేశానికి వచ్చిన ప్రపంచ స్థాయి దిగ్గజంతో అలా ప్రవర్తించడం సరికాదని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఆమె సెల్ఫీకి వెళ్లిన సమయంలో మెస్సీ కాస్త అసౌకర్యంగా కనిపించాడని.. పైగా మెస్సీతో ఒకటికి రెండుసార్లు సెల్ఫీలు తీసుకునే ప్రయత్నం చేసి, అతడిని ఇబ్బంది పెట్టారని కామెంట్లు పెడుతున్నారు. దీనితో పాటు.. మరో ఫుట్ బాల్ క్రీడాకారుడు లూయిస్ సువారెజ్ ను దాటి.. అనుమతి లేకుండా మెస్సీ దగ్గరకు వెళ్లారని, ఇది ఆమోదయోగ్యంగా అనిపించలేదని రాసుకొస్తున్నారు.

అదే విధంగా... మెస్సీ చిరకాల స్నేహితుల్లో ఒకరైన, ఎఫ్.సీ. బార్సీలోనా సహచరుడు సూరెజ్ తోపాటు.. మరో అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం, మెస్సీ స్నేహితుడు రోడ్రిగో డీ పాల్ ను సెల్ఫీల నుంచి మినహాయించడం సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు. "మీ వైఖరి చూస్తుంటే.. మెస్సీ మీతో ఫోటో తీయించుకోవడానికి వచ్చినట్లు కనిపిస్తోంది" అంటూ మరో ఎక్స్ యూజర్ రాసుకొచ్చారు!

కాగా... "ద గోట్ ఇండియా టూర్"లో భాగంగా ఆదివారం ముంబైలో సందడి చేశారు మెస్సీ. ఇందులో భాగంగా... మెస్సీ, రోడ్రిగో డీపాల్, లూయిస్ సువారెజ్ లు అత్యంత పటిష్ట భద్రత నడుమ సాయంత్రం బ్రబోర్న్ స్టేడియానికి వెళ్లి, అక్కడ సెలబ్రెటీ ఫుట్ బాల్ మ్యాచ్ ను వీక్షించి.. అనంతరం వాంఖడే స్టేడియానికి వచ్చారు.