Begin typing your search above and press return to search.

"పురుషులకు మాత్రమే" హైద్రాబాద్ లో అరుదైన దృశ్యం!!

సాధారణంగా ఆర్టీసీ బస్సుల్లో.. "సీట్లకు మాత్రమే" అనే బోర్డుతో కొన్ని సీట్లు రిజర్వ్ చేసి ఉండేవి.

By:  Tupaki Desk   |   1 Feb 2024 1:02 PM GMT
పురుషులకు మాత్రమే  హైద్రాబాద్  లో అరుదైన దృశ్యం!!
X

సాధారణంగా ఆర్టీసీ బస్సుల్లో.. "సీట్లకు మాత్రమే" అనే బోర్డుతో కొన్ని సీట్లు రిజర్వ్ చేసి ఉండేవి. ఇక చాలా సందర్భాల్లో, పలు చోట్ల "మహిళలకు మాత్రమే" అనే బోర్డులను గమనిస్తూనే ఉంటాం.. ప్రత్యేకంగా లేడిస్ జిం, బ్యూటీ పార్లర్ ల ముందు ఈ బోర్డులు కనిపిస్తుంటాయి! అయితే... "పురుషులకు మాత్రమే" అనే బోర్డులు ఎక్కడా పెద్దగా కనిపించవు! అయితే... ఇప్పుడు తెలంగాణలోని ఆర్టీసీ బస్సుల్లో తెల్ల బోర్డుపై ఎర్ర అక్షరాలతో ఇవి కనిపిస్తున్నాయి.


అవును... తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలలో ఒకటైన ఈ పథకం అమలులోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళల రద్దీ బాగా పెరిగింది. ఫలితంగా... పురుషులకు సీట్లు దొరకటం మాట అటుంచి, నిలబడటానికే కష్టంగా మారిపోయింది పరిస్థితి. మరోపక్క తమ ఉపాధి కోల్పోతున్నామంటూ ఆటో డ్రైవర్లు, ప్రైవేటు బస్సు డ్రైవర్లు రెడ్డెక్కారు.

ఇదే సమయంలో... కొన్ని రూట్లు, ప్రత్యేక సమయాల్లో పురుషుల కోసం ప్రత్యేకంగా బస్సులు నడిపే అంశం తెర పైకి వచ్చింది. ఇదే సమయంలో విద్యార్థులకు సైతం ప్రత్యేక బస్సులు నిర్వహించాలనే విషయాన్ని అధికారులు యాజమాన్యానికి వివరించారని తెలుస్తుంది. ఇదే సమయంలో... సీనియర్ సిటిజన్లకు తొలి ప్రాధాన్యత గురించి సైతం చర్చించినట్లు కథనాలొచ్చాయి!

ఈ సమయంలోనే పురుషుల గురించి, వారు పడుతున్న ఇబ్బందుల గురించి కాస్త మనసుపెట్టి ఆలోచించినట్లుంది తెలంగాణ ఆర్టీసీ! ఇందులో భాగంగా... "పురుషులకు మాత్రమే" అనే బోర్డులతో ప్రత్యేక బస్సులను రోడ్డు మీదకు తీసుకొచ్చింది. ఈ మేరకు హైదరాబాద్ లో ఒక ట్రైల్ రన్ చేసి చూసింది. ఈ బస్సుల్లోకి మహిళలను అనుమతించరు. ఈ క్రమంలో తాజాగా ఈ ప్రత్యేకమైన బస్సు ఇబ్రహీంపట్నం – ఎల్బీనగర్ రూట్ లో కనిపించింది.

ఇలా తాజాగా చేపట్టిన ట్రైల్ రన్ ఇచ్చిన ఫలితాలు, ఫీడ్ బ్యాక్ ని బట్టి ఏయే రూట్లలో, ఏయే సమయాలలో ఎన్నెన్ని బస్సులు తిప్పాలనే విషయంపై అధికారులు సమాలోచనలు చేసి ఒక క్లారిటీకి వస్తారని.. అనంతరం సిటీ మొత్తం "పురుషులకు మాత్రమే" బస్సులు హల్ చల్ చేయనున్నాయని తెలుస్తుంది!