Begin typing your search above and press return to search.

30 ఏళ్ల అందం, 60 కోట్ల స్కామ్! బంగ్లాదేశ్ మోడల్‌తో సౌదీకి షాక్!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మేఘనా ఏకంగా 60 కోట్ల టాకాలు (దాదాపు 45 కోట్ల రూపాయలు) డిమాండ్ చేయడంతో సౌదీ రాయబారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

By:  Tupaki Desk   |   15 April 2025 10:00 PM IST
30 ఏళ్ల అందం, 60 కోట్ల స్కామ్! బంగ్లాదేశ్ మోడల్‌తో సౌదీకి షాక్!
X

బంగ్లాదేశ్‌కు చెందిన 30 ఏళ్ల మోడల్ మేఘనా ఆలం పెద్ద మోసగాత్తె అని తేలింది. పోలీసుల కథనం ప్రకారం, మేఘనా ఆలం తన అందాల వలలో సౌదీ అరేబియా రాయబారిని చిక్కుకునేలా చేసింది. ఆ తర్వాత అతడిని బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టింది. మొదట్లో చిన్న మొత్తంలో డబ్బు డిమాండ్ చేయడంతో రాయబారి పెద్దగా పట్టించుకోలేదు. కానీ మేఘనా డిమాండ్లు క్రమంగా పెరిగిపోయాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మేఘనా ఏకంగా 60 కోట్ల టాకాలు (దాదాపు 45 కోట్ల రూపాయలు) డిమాండ్ చేయడంతో సౌదీ రాయబారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మేఘనాను 30 రోజుల కస్టడీకి పంపారు. మేఘనాపై హనీట్రాప్ ఆరోపణలు నమోదయ్యాయి.

సౌదీ రాయబారిని మేఘనా ఎలా బుట్టలో వేసింది?

ఇస్సా బిన్ యూసుఫ్ అల్-దుహైలాన్‌ను ఫిబ్రవరి 2020లో బంగ్లాదేశ్‌కు రాయబారిగా నియమించారు. ఒక సన్నిహిత స్నేహితుడి ద్వారా ఇస్సా, మేఘనా ఒకరికొకరు పరిచయమయ్యారని నివేదికలు చెబుతున్నాయి. వారిద్దరి మధ్య ప్రేమ నెమ్మదిగా చిగురించింది. ఈ సమయంలో తమ మధ్య శారీరక సంబంధాలు కూడా ఏర్పడ్డాయని మేఘనా చెప్పింది.

2024లో ఇస్సా బదిలీ అయిన తర్వాత మేఘనా అతడిని బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించింది. మొదట్లో కొంత డబ్బు డిమాండ్ చేసింది. ఆ తర్వాత ఏకంగా 60 కోట్ల టాకాలు ఇవ్వాలని ఒత్తిడి చేసింది. ఇస్సాకు సంబంధించిన కొన్ని వ్యక్తిగత వీడియోలను కూడా మేఘనా చిత్రీకరించిందని పోలీసులు తెలిపారు.

ఆ వీడియోలను వైరల్ చేస్తానని ఇస్సాను బెదిరించారు. ప్రాథమిక విచారణ తర్వాత ఈ కేసులో మరొక వ్యక్తి పాత్ర కూడా ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తి సౌదీలోనే వ్యాపారం చేస్తున్నాడని తెలుస్తోంది.

పోలీసులు ఏం చేస్తున్నారు?

హనీట్రాప్ కేసును పోలీసులు ప్రత్యేక విభాగానికి అప్పగించారు. మేఘనా ఇంతకు ముందు కూడా ఏదైనా రాయబారిని బుట్టలో వేసిందా అనే కోణంలో బంగ్లాదేశ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హనీట్రాప్‌కు సంబంధించిన ఇతర లింక్‌లను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. మరోవైపు, ఉన్నతాధికారులు సౌదీతో సంబంధాలను మెరుగుపరిచే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. బ్లాక్‌మెయిల్ వ్యవహారం తర్వాత సౌదీ అరేబియా ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని బంగ్లాదేశ్ భయపడుతోంది. మేఘనా బంగ్లాదేశ్‌లో అందమైన మోడళ్లలో ఒకరిగా గుర్తింపు పొందింది. ఆమె మిస్ ఎర్త్ టైటిల్‌ను కూడా గెలుచుకుంది.