Begin typing your search above and press return to search.

వివాహానికి ముందు హెచ్ఐవీ టెస్ట్ తప్పనిసరి.. సర్కార్ సంచలన నిర్ణయం!

అవును... వివాహానికి ముందు అంతా హెచ్ఐవీ/ఎయిడ్స్ పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి చేసే దిశగా మేఘాలయా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   28 July 2025 8:15 AM IST
వివాహానికి ముందు హెచ్ఐవీ టెస్ట్ తప్పనిసరి.. సర్కార్ సంచలన నిర్ణయం!
X

వివాహానికి ముందు హెచ్ఐవీ టెస్ట్ ను తప్ప తప్పనిసరి చేస్తూ గోవా ప్రభుత్వం సరికొత్త నిబంధన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. మేఘాలయ ప్రభుత్వం కూడా ఇప్పుడు గోవా తరహాలోనే ఆ నిబంధన తీసుకురావాలని యోచిస్తోందని అంటున్నారు. దీని ప్రకారం వివాహానికి ముందు అందరూ హెచ్ఐవీ/ఎయిడ్స్ పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి చేయవచ్చు!

అవును... వివాహానికి ముందు అంతా హెచ్ఐవీ/ఎయిడ్స్ పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి చేసే దిశగా మేఘాలయా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని అంటున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య మంత్రి మాజెల్ అంపారీన్ లింగ్డో వెల్లడించారు! మేఘాలయ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (ఎంఏసీఎస్) నివేదిక రాష్ట్రంలో హెచ్ఐవీ/ఎయిడ్స్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వెల్లడించిందని అన్నారు.

ఈ నేపథ్యంలోనే... ప్రభుత్వం ఈ కొత్త చట్టాన్ని తీసుకురావాలని యోచిస్తోందని అంటున్నారు. ఈ నిర్ణయం సమాజానికి ఎంతో మేలు చేస్తుందని, సకాలంలో వ్యాధిని గుర్తించడానికి సహకరిస్తుందని అంటున్నారు. ఇదే సమయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రెస్టోన్ టిన్సోంగ్ తాజాగా హెచ్ఐవీ/ఎయిడ్స్ కోసం సమగ్ర విధానాన్ని రూపొందించడానికి ఒక సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమావేశంలో తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా పరిస్థితి గురించి ప్రత్యేకంగా చర్చించినట్లు చెబుతున్నారు. ఈ జిల్లాలో 2024 సంవత్సరంలో 3,432 మంది హెచ్ఐవీ పాజిటివ్‌ గా గుర్తించారని.. ఇది గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు రెట్టింపని చెబుతున్నారు. అయితే... వీరిలో 1,581 మంది మాత్రమే చికిత్స తీసుకుంటున్నారని వెల్లడించారు.