హనీమూన్ మర్డర్ కేసు : కాల్ డేటా లీక్: హత్యకు ముందు 119 సార్లు ఫోన్ సంభాషణలు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది.
By: Tupaki Desk | 18 Jun 2025 5:02 PM ISTదేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. రాజా రఘువంశీ హత్య కేసు దర్యాప్తులో ఇంతవరకు బయటపడని మరో వ్యక్తి పేరు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్, హత్యకు ముందు సంజయ్ వర్మ అనే వ్యక్తితో 119 సార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
- హత్యకు ముందే 119 సార్లు సంజయ్‌తో సంభాషణ!
పోలీసులు సోనమ్ యొక్క కాల్ డేటా రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించగా మార్చి 1 నుంచి మార్చి 25 మధ్య ఆమె సంజయ్ వర్మ అనే వ్యక్తితో ఏకంగా 119 సార్లు మాట్లాడినట్లు గుర్తించారు. ప్రస్తుతం సంజయ్ మొబైల్ స్విచ్‌ఆఫ్‌లో ఉంది. ఈ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణల నేపథ్యంలో ఈ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి రావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. త్వరలోనే సంజయ్ వర్మను గుర్తించి ప్రశ్నించనున్నట్లు సమాచారం.
- హనీమూన్ ట్రిప్‌లో ఘోర దారుణం
మే 23న మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్ ప్రాంతంలోని వీ సావ్‌డాంగ్ జలపాతం సమీపంలో రాజా రఘువంశీ హత్యకు గురయ్యాడు. జూన్ 2న అతడి మృతదేహాన్ని లోయలో గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ జూన్ 8న ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ పోలీసులకు లొంగిపోయింది.
- హత్యకు సహకరించిన హంతకులు
పోలీసుల విచారణలో మరో కీలక విషయం బయటపడింది. హంతకుల్లో ఒకరైన విశాల్ సింగ్ ఇచ్చిన సమాచారంతో రాజా రఘువంశీపై కత్తితో దాడి చేసి చంపినట్టు వెల్లడించాడు. హత్య సమయంలో సోనమ్ అక్కడే ఉండి దాడిని ప్రత్యక్షంగా చూసిందని తెలిపాడు. రాజా కేకలు వేయడంతో సోనమ్ అక్కడి నుంచి పారిపోయిందని, ఆ తర్వాత హంతకులు మరిన్ని దాడులు చేసి అతన్ని హత్య చేసినట్టు విశాల్ వివరించాడు.
-దర్యాప్తులో మరిన్ని మలుపులు?
ఈ కేసులో సంజయ్ వర్మ పేరు బయటపడటంతో దర్యాప్తు మరో మలుపు తిరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
