Begin typing your search above and press return to search.

హెడ్‌మాస్టర్ దారుణం.. శ్మశానానికి తీసుకెళ్లి పిల్లలకు మత బోధన

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఒక హెడ్‌మాస్టర్ చేసిన పని వెలుగులోకి రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు.

By:  Tupaki Desk   |   28 April 2025 12:00 AM IST
హెడ్‌మాస్టర్ దారుణం.. శ్మశానానికి తీసుకెళ్లి పిల్లలకు మత బోధన
X

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగిన ఒక షాకింగ్ ఘటన సమాజంలో కలకలం రేపుతోంది. ఒక స్కూల్ హెడ్మాస్టర్ మూడో తరగతి విద్యార్థులను శ్మశానానికి తీసుకెళ్లి వారి కళ్లకు గంతలు కట్టి ప్రార్థనలు చేయించడం మాత్రమే కాకుండా, వారి మతం మార్చే ప్రయత్నం చేయడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిస్తోంది. ఈ ఉదంతం విద్యార్థుల తల్లిదండ్రులకు ఆగ్రహాన్ని తెప్పించగా.. వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఒక హెడ్‌మాస్టర్ చేసిన పని వెలుగులోకి రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. హెడ్‌మాస్టర్ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన మీరట్‌లోని ఒక మిషనరీ స్కూల్‌లో జరిగింది. ఇక్కడ స్కూల్ హెడ్‌మాస్టర్ మూడో తరగతి పిల్లలకు కళ్లకు గంతలు కట్టి స్మశానానికి తీసుకెళ్లారు. అక్కడ వారిచే ప్రార్థన చేయించారు. అంతేకాదు, పిల్లల శరీరానికి మట్టి పూసి ఇకపై వారి దేవుడు జీసస్ అని జీసస్‌నే పూజించాలని చెప్పారు. ఆ తర్వాత ఈ విషయం ఎవరికైనా చెబితే శిక్షిస్తానని హెడ్‌మాస్టర్ బెదిరించారు.

ఈ ఘటన పర్తాపూర్ ప్రాంతంలోని సెయింట్ పాట్రిక్స్ స్కూల్‌లో జరిగింది. ఇక్కడ పిల్లలను శ్మశానానికి తీసుకెళ్లి వారిని మతం మార్చే ప్రయత్నం చేశారు. దీంతో పిల్లలు ఇంటికి చేరుకున్నాక ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పారు. పిల్లల మాటలు విని తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు పిల్లలను కలిసి వివరాలు తెలుసుకున్నారు. స్కూల్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. తల్లిదండ్రులు , పిల్లల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

దీనికి ముందు అమేథీలోని జగదీష్‌పూర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని పాల్పూర్ పట్టణంలో పెద్ద ఎత్తున మతమార్పిడి ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పట్టణంలోని జామో రోడ్డులో ఉన్న ఒక ఇంటిపై దాడి చేశారు. అక్కడ నుంచి వందలాది మంది మహిళలు, పురుషులను పట్టుకున్నారు. సంఘటనా స్థలంలో పోలీసులు ఒక క్రైస్తవ మిషనరీ మహిళతో సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఇంటి నుండి పెద్ద మొత్తంలో మతమార్పిడికి సంబంధించిన పుస్తకాలు, పత్రాలు, ఇతర సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు.