Begin typing your search above and press return to search.

తమ్ముడి ముందు బాలికపై గ్యాంగ్ రేప్.. అసలు కారణం ఇదేనా?

మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం ఘటన తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   23 Aug 2023 5:36 AM GMT
తమ్ముడి ముందు బాలికపై గ్యాంగ్ రేప్.. అసలు కారణం ఇదేనా?
X

మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం ఘటన తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. సోదరుడి ముందే మైనర్ బాలికపై అత్యాచారం చేశారంటూ వెలువడిన వార్తలపై గవర్నర్ కూడా స్పందించారు. దీంతో ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ దారుణానికి గల కారణాలను సీపీ వెల్లడించారు.

అవును... మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికపై అత్యాచారం కేసుకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్. ఇందులో భాగంగా... ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపిన ఆయన... మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వీరందరిపైనా ఫోక్స్ యాక్ట్, సెక్షన్ 5జీ కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

లాల్‌ బజార్‌ కు చెందిన బాలిక తల్లిదండ్రులిద్దరూ గతంలో చనిపోవడంతో తన సోదరుడితో కలిసి మీర్‌ పేటలో ఉంటుంది. బాధిత బాలిక ఇంట్లో ఉన్నా సమయంలో ప్రధాన నిందితుడు ఏ1, తన స్నేహితుడు ఏ2 తో కలిసి బాలిక ఇంట్లోకి వెల్లాడు. అనంతరం ఆమె నోరు గట్టిగా మూసి బలవంతంగా అత్యాచారం చేశారు.

అనంతరం కత్తి చూపించి బెదిరిస్తూ... బాలికపై వరుసగా నలుగురు సామూహిక అత్యచారం చేశారు అని సీపీ చౌహాన్ తెలిపారు. ఇదే సమయంలో వీరిలో ప్రధాన నిందితుడు ఏ1 కి బాలికతో ముఖపరిచయం ఉందని సీపీ వెల్లడించారు. నిందులను ఏ1 నుంచి ఏ7 గా ఫిక్స్ చేశారు. వీరిలో ఏ2 ప్రస్తుతం పరారీలో ఉన్నాడని సీపీ తెలిపారు!

ఇదే సమయంలో బాలిక ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని.. వైద్య పరీక్షలు నిర్వహించామని సీపీ డీఎస్ చౌహన్ తెలిపారు. కాగా... ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన గవర్నర్, 48 గంటల్లో నివేదిక ఇవ్వాలంటూ పోలీసు ఉన్నతాధికారుల్ని ఆదేశించిన సంగతి తెలిసిందే.

ఇక ఈ నిందితుల్లో ఏ1 రౌడీ షీటర్ కాగా, మిగిలిన నిందితులపై కూడా చాలా కేసులు ఉన్నాయని అంటున్నారు. ఇదే సమయంలో నిందితులు గంజాయి తీసుకున్నట్లు తెలుస్తుందని సీపీ పేర్కొన్నారు. కాగా... రాచకొండ పోలీస్ స్టేషన్ లో పరిధిలో గంజాయి గ్యాంగ్స్ ఎక్కువగా సంచరిస్తున్నాయంటూ కథనాలొస్తున్న సంగతి తెలిసిందే!