తల్లి పిటిషన్.. పోలీసులకు చిక్కిన హీరోయిన్.. అరెస్ట్ చేయాలన్న కోర్ట్!
అయితే ఆ హీరోయిన్ తల్లి తన కూతుర్ని కాపాడాలి అని ఇచ్చిన పిటిషన్ తో ఆ హీరోయిన్ ను కనుక్కున్న పోలీసులు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
By: Tupaki Desk | 5 Aug 2025 11:30 AM ISTసినీ ఇండస్ట్రీలో కొంతమంది అప్పుడప్పుడు చేసే వ్యాఖ్యలు వివాదాలకు దారితీస్తున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ మొదలుకొని ఈమధ్య వార్తల్లో నిలుస్తున్న మీరా మిథున్ వరకు ఇలా చాలామంది అటు తోటి సెలబ్రిటీలపై అనూహ్య కామెంట్స్ చేస్తూ కాంట్రవర్సీ ఎదుర్కొంటున్నారు. అయితే ఈ కాంట్రవర్సీ అప్పుడప్పుడు ఎంతటి అనర్థాలకు దారితీస్తోంది అంటే ఆఖరికి ఆ సెలబ్రిటీలను అరెస్టు చేసే వరకు పరిస్థితి దిగజారుతోంది. ఈ క్రమంలోనే ఒక హీరోయిన్ కోసం పోలీసులు దాదాపుగా మూడు సంవత్సరాలుగా వెతుకుతున్నారు. కానీ ఆమె జాడ కనిపించలేదు. అయితే ఆ హీరోయిన్ తల్లి తన కూతుర్ని కాపాడాలి అని ఇచ్చిన పిటిషన్ తో ఆ హీరోయిన్ ను కనుక్కున్న పోలీసులు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మరి ఆ హీరోయిన్ ఎవరు? ఆమె కోసం పోలీసులు మూడేళ్లుగా ఎందుకు గాలిస్తున్నారు? అసలు ఆ హీరోయిన్ చేసిన తప్పేంటి.? తన కూతుర్ని కాపాడాలి అని తల్లి ఇప్పుడు ఎందుకు పిటిషన్ ఇచ్చింది ? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.
అసలు విషయంలోకి వెళ్తే.. కోలీవుడ్ నాట కాంట్రవర్సీ బ్యూటీగా పేరు సొంతం చేసుకుంది మీరా మిథున్. ఒకప్పుడు తన అద్భుతమైన నటనతో, అందంతో పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది ఈ చిన్నది. కానీ అనూహ్యంగా అటు స్టార్ సెలబ్రిటీలపై ఇటు దళితులపై ఈమె చేసిన కామెంట్లు ఈమెను చిక్కుల్లో పడేలా చేశాయి. అసలు విషయంలోకి వెళ్తే.. 2021లో దళితులపై మీరా మిథున్ చేసిన అనుచిత వ్యాఖ్యలు పెద్ద దుమారం సృష్టించాయి. ఈ వివాదంలో ఆమెతోపాటు ఆమె స్నేహితుడు శ్యామ్ అభిషేక్ కూడా ఉన్నారు. దీంతో దళితుల నుండి డిమాండ్స్ వస్తున్న నేపథ్యంలో వీరిద్దరిపై పోలీసులు కేసు ఫైల్ చేసి అరెస్టు కూడా చేశారు. కానీ కొద్ది రోజులకే బెయిల్ మీద వీరిద్దరూ బయటకు వచ్చారు.
ఇక కేసు విచారణకు సహకరించాలి అని న్యాయస్థానం తీర్పు ఇచ్చినా.. వీరు మాత్రం విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో అరెస్టు వారెంట్ జారీ చేసింది కోర్ట్. అలా దాదాపు 2022 నుంచి ఇప్పటివరకు పోలీసులు మీరా మిథున్ , ఆమె స్నేహితుడు శ్యామ్ అభిషేక్ లను పట్టుకోవడానికి గాలిస్తూనే ఉన్నా .. ఆమె పరారీలోనే ఉండడంతో పోలీసులు గుర్తించలేకపోయారు.
అయితే ఇప్పుడు తాజాగా ఢిల్లీ వీధుల్లో ఈమె తిరుగుతుండడంతో తన కూతుర్ని కాపాడాలి అని మీరా మిథున్ తల్లి ఒక పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన కోర్టు మీరాను రక్షించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ పోలీసులు ఆమెను ఇంటికి తరలించగా.. విషయం తెలుసుకున్న చెన్నై కోర్టు ఈమెను అరెస్టు చేసి, ఈనెల 11వ తేదీన చెన్నై న్యాయస్థానంలో హాజరు పరచాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. మొత్తానికి అయితే గత మూడు సంవత్సరాలుగా పరారీలో ఉంటూ తప్పించుకు తిరిగిన మీరా మిథున్ తల్లి పిటిషన్ తో బయటపడిందని సమాచారం. ప్రస్తుతం ఈమెకి సంబంధించిన వార్తలు వైరల్ గా మారుతున్నాయి.
