Begin typing your search above and press return to search.

దేవాలయంలో నగ్నంగా ధ్యానం... వేటాడిన ఇండోనేషియా!

హిందువులు దేవాల‌యానికి వెళ్లేటప్పుడు సంప్రదాయ దుస్తులు ధ‌రిస్తారనేది తెలిసిన విషయమే.

By:  Tupaki Desk   |   5 Oct 2023 3:20 PM GMT
దేవాలయంలో నగ్నంగా ధ్యానం... వేటాడిన ఇండోనేషియా!
X

హిందువులు దేవాల‌యానికి వెళ్లేటప్పుడు సంప్రదాయ దుస్తులు ధ‌రిస్తారనేది తెలిసిన విషయమే. ఉన్నంతలో మంచిగా రెడీ అయ్యి ఆలయానికి వెళ్తారు. అయితే తాజాగా ఓ వ్యక్తి మాత్రం హిందూ దేవాల‌యంలోకి న‌గ్నంగా ప్రవేశించాడు. అనంతరం ఆల‌యంలో అలాగే ధ్యానం చేశాడు. ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.

అవును... ఇండోనేషియాలోని చారిత్రాక ప్రదేశ‌మైన బాలిలో ఒక వ్యక్తి నగ్నంగా హిందూ దేవాలయంలో పూజలు చేశాడు. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాల‌యంలో బాలిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ గుడికి హిందువుల‌తో పాటు ఆయా దేశాల ప‌ర్యాట‌కులు వ‌స్తుంటారు.

ఈ నేపథ్యంలో... ఇటీవ‌లే ఆ ఆల‌యంలోకి ఓ వ్యక్తి ప్రవేశించి, న‌గ్నంగా మారి ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. దీంతో... దీనికి సంబంధించిన వీడియో ఇండోనేషియాలోని సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. దీంతో భ‌క్తులు మండిప‌డ్డారు. గుడిలో న‌గ్నంగా ధ్యానం చేసిన వ్యక్తిని గుర్తించాల‌ని అధికారుల‌ను కోరారు.

ఇదే సమయంలో ఇలాంటి ఆలోచనలు ఉన్న టూరిస్టులు ఇండోనేషియాకు రావాల్సిన అవసరం లేదని, ఇలాంటివారికి బాలిలో ప్రవేశం నిషిద్దమని ఫైరయ్యారు. ఇదే సమయంలో న‌గ్నంగా ధ్యానం చేసిన వ్యక్తిని గుర్తించాల‌ని ఇమ్మిగ్రేష‌న్ అధికారుల‌ను కోరారు.

ఈ క్రమంలో న‌గ్నంగా ధ్యానం చేసిన వ్యక్తిని అధికారులు గుర్తించారని తెలుస్తుంది. అయితే... అత‌ను ఏ దేశ‌స్తుడు అనే విష‌యాన్ని మాత్రం బ‌హిరంగంగా వెల్లడించ‌లేద‌ని అంటున్నారు. అయితే బాలిలోని హిందూ దేవాల‌యంలో ఇటువంటి ఘటన జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలో... ర‌ష్యాకు చెందిన‌ లూయిజా కోసిఖ్‌ అనే 40 ఏళ్ల మహిళ బాలిలోని 700 ఏళ్ల నాటి మర్రి చెట్టు ముందు నగ్నంగా ఫోటో తీయించుకుంది.

అనంతరం ఆ న్యూడ్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పిక్ కాస్త నెట్టింట వైరల్‌ గా మారింది. దీంతో... ఈ ఫోటో ఆ దేశంలోని హిందువుల కంట పడడంతో వారు తీవ్రంగా ఆగ్రహించారు. అనంతరం అధికారులకు సమాచారం చేరవేయడంతో లూయిజా కోసిఖ్‌ ను బాలి నుంచి బహిష్కరించడంతో పాటు అరెస్ట్ చేశారు.

ఈ క్రమంలోనే తాజాగా ఒక వ్యక్తి నగ్నంగా మారి ఏకంగా పూజలు చేయడం ప్రారంభించాడు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో అతడిని తాజాగా గుర్తించారని తెలుస్తుంది.