Begin typing your search above and press return to search.

టిక్కెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. ఆస్పత్రిలో ఎంపీ కన్నుమూత!

వివరాళ్లోకి వెళ్తే... 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో తమిళనాడులోని ఈ రోడ్ టిక్కెట్ డీఎంకే కూటమిలో భాగంగా ఎండీఎంకే కు దక్కింది.

By:  Tupaki Desk   |   28 March 2024 7:27 AM GMT
టిక్కెట్  రాలేదని ఆత్మహత్యాయత్నం.. ఆస్పత్రిలో ఎంపీ కన్నుమూత!
X

ఎన్నికల సమయంలో టిక్కెట్లు ఆశించి.. అది దక్కకపోతే.. సదరు అభ్యర్థి పడే బాద వర్ణనాతీతమని, అది అనుభవించేవారికి మాత్రమే తెలుస్తుందని చాలా మంది చెబుతుంటారు! ఈ సమయంలో వారి వారి కార్యకర్తలు ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా చేస్తున్న వార్తలు మీడియాలో దర్శనమిస్తుంటాయి. అయితే... తనకు టిక్కెట్ రాలేదని ఏకంగా ఎంపీ అభ్యర్థే ఆత్మహత్యాయత్నం చేశారు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

అవును... లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆశావహులంతా టిక్కెట్లు సంపాదించే పనుల్లో బిజీగా ఉన్నారు! పార్టీ అధినేతల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారని అంటున్నారు! ఈ క్రమంలోనే తమిళనాడుకు చెందిన ఎంపీ, తనకు టిక్కెట్ దక్కకపోవడంతో ఇటీవల ఆత్మహత్యా యాత్నం చేశారు. ఈ క్రమంలో చికిత్స పోందుతూ ఆస్పత్రిలో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో.. ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది.

వివరాళ్లోకి వెళ్తే... 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో తమిళనాడులోని ఈ రోడ్ టిక్కెట్ డీఎంకే కూటమిలో భాగంగా ఎండీఎంకే కు దక్కింది. దీంతో... అక్కడ నుంచి ఆ పార్టీ నేత గణేశమూర్తి ఉదయించే సూర్యుడీ (డీఎంకే) గుర్తుపైనే పోటీచేశారు. ఆ ఎన్నికల్లో గణేశమూర్తి 2,10,618 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే రానున్న ఎన్నికల్లో కూటమిలో సీట్ల సర్దుబాటులో భాగంగా ఎండీఎంకే కు తిరుచ్చి కేటాయించగా.. దురైవైగో ను అభ్యర్థిగా నిలబెట్టింది ఆ పార్టీ.

దీంతో... గణేశమూర్తి తీవ్రమనస్థాపం చెందారు! అనంతరం... విషపూరిత ట్యాబ్లెట్లు మింగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి!! ఈ క్రమంలో మార్చి 24న ఆయనను ఆస్పత్రికి తరలించగా... గత నాలుగు రోజులుగా ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఆయన కన్నుమూసినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో... స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది!

కాగా... 1993లో ఎండీఎంకే ప్రారంభమైనప్పటి నుంచీ గణేశమూర్తి ఆ పార్టీలోనే ఉన్నారు. ఈ క్రమంలో 1998లో తొలిసారిగా పళని లోక్ సభ స్థానం నుంచి గెలిచిన ఆయన.. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లోను పోటీచేసి గెలిచారు. ఈ క్రమంలోనే 2009లో ఈరోడ్ నుంచి ఎంపీగా అన్నికయ్యరు. అయితే ఇదే స్థానం నుంచి 2014లో ఓటమిపాలై, గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ క్రమంలో మరోసారి తనకు ఈరోడ్ టిక్కెట్ దక్కుతుందని ఆశించిన నేపథ్యంలో... ఇలా జరిగిపోయింది!