Begin typing your search above and press return to search.

ఇంతకూ జైషే మ‌హ‌మ్మ‌ద్ చీఫ్ మ‌సూద్ అజార్ ఎక్కడ?

అంతకు మించిన కుతంత్రాల్ని వండి వార్చే పాక్ కు తోడైన వినాశకారి జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంలో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ గురించి తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడికి కర్త.. కర్మ.. క్రియ అతడే.

By:  Tupaki Desk   |   15 May 2025 9:12 AM IST
ఇంతకూ జైషే మ‌హ‌మ్మ‌ద్ చీఫ్ మ‌సూద్ అజార్ ఎక్కడ?
X

మంచోళ్లతో స్నేహం చేస్తే మంచే వస్తుందని.. అదే చెడ్డోళ్లతో చేస్తే చికాకులు తప్పవంటూ మన పెద్దోళ్లు చెబుతుండేవారు. దాయాది పాక్ తాజా పరిస్థితి చూస్తే ఈ మాటల్లో నిజం ఎంతన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. అర్థం లేని ఆవేశాన్ని.. అంతకు మించిన కుతంత్రాల్ని వండి వార్చే పాక్ కు తోడైన వినాశకారి జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంలో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ గురించి తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడికి కర్త.. కర్మ.. క్రియ అతడే.

అతగాడి మూర్ఖత్వం అతనికి ఆశ్రయం ఇవ్వటంతో పాటు.. అతని సలహాలను అమలు చేయటం ద్వారా పాకిస్తాన్ ఇప్పుడు కోలుకోలేని దెబ్బకు కారణమయ్యారన్నది మర్చిపోకూడదు. ఉగ్రవాదులకు.. ఉగ్ర క్యాంపులకు కేరాఫ్ అడ్రస్ గా పాక్ ను మార్చేసిన.. ఆ దేశ పాలకుల్ని తన గుప్పిట్లో పెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరించే ఈ జైషే మహమ్మద్ చీఫ్ దెబ్బకు పహల్గాం ఉగ్రదాడి.. అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్... దీనికి ప్రతిగా పాక్ సైన్యపు దాడులు చేపట్టటం.. ఈ నేపథ్యంలో దాయాదికి తగిన రీతిలో గుణపాఠం చెప్పేందుకు వీలుగా భారత్ ప్లాన్ చేసింది.

అనుకున్నట్లే తాము వేసుకున్న అంచనాలకు తగ్గట్లే పాక్ ఎయిర్ బేస్ మొదలుకొని పాక్ లోని పలు కీలక ప్రాంతాల్లో దాడులను చేపట్టింది భారత్. అయితే.. రోజులు గడుస్తున్న కొద్దీ పాక్ మీడియా మొదలుకొని అంతర్జాతీయ మీడియా వరకు పాక్ పైన భారత్ దాడులు ఎంత తీవ్రంగా ఉన్నాయన్న విషయాన్ని స్పష్టం చేశాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పాక్ పంచాయితీలకు అసలుసిసలు సొల్యూషన్ పాక్ అక్రమిత కశ్మీర్ భారత్ కు అప్పగించటమే. అయితే.. ఈ పంచాయితీ ఇప్పట్లలో తెగేది కాదు.

ఇంతవరకు బాగానే ఉన్నా..తాజా పరిణామానికి కారకులు ఎవరన్న ప్రశ్నకు ఎవరైనా చెప్పే సమాధదనం జైషే మహమ్మద్. పాకిస్తాన్ ఎదుర్కొంటున్న తాజా దుస్థితి ఇతడి కారణంగా వచ్చిందన్నది తెలిసిందే. అతడ్ని వెనకేసుకొచ్చి.. అతను పన్నిన విష వ్యూహానికి అడ్డంగా బుక్ అయ్యింది ఆ దేశ ప్రజలు.. ప్రభుత్వమే. సైన్యం చేతిలో బొమ్మలా ఆడే పాక్ ప్రభుత్వం ఇంతకు మించి చేయగలిగింది కూడా ఏమీ ఉండదు. ఆపరేషన్ సిందూర్ లో భారీగా నష్టపోయిన జైష్ ఎ మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ వ్యక్తిగతంగా తన కుటుంబాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. వందకు పైగా దళ సభ్యుల్ని భారత సైన్యం జరిపిన దాడులు మట్టుబెట్టాయి. కాకుంటే.. అతను మాత్రం ఈ దాడుల నుంచి తప్పించుకున్నాడు.

అప్పటి నుంచి అతడి ఆచూకీ మీద ఎలాంటి వార్తలు రావట్లేదు. మరి.. అతను ఎక్కడ ఉన్నట్లు? ఏం చేస్తున్నట్లు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు లేవు. ఇలాంటి వేళ.. అతను ఎక్కడ ఉండే అవకాశం ఉందన్న విషయంపై కొన్ని వర్గాలు జరిపిన శోధనలో తేలిందేమంటే.. జైషే ఎ మహమ్మద్ ప్రధాన కార్యాలయం వెనుక భాగంలోని బంకర్ లో సురక్షితంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. భారత సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో అతని భార్య.. సోదరి.. ఆమె భర్త.. మేనల్లుడు.. మరో మేనకోడలు.. తన ఐదుగురు పిల్లల్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది.

ఇతడి కోసం వేట ప్రారంభించిన భారత ప్రభుత్వానికి దొరక్కుండా ఉండేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం అతను పాక్ లోని బహావల్పూరులో ఉన్నట్లుగా నివేదికలు స్పష్టం చేస్తున్నాడు. అయితే.. దీన్ని ఖరారు చేసే అధికారిక సమాచారం అందుబాటులో లేదు. పహల్గాం ఉగ్ర ఘటన అనంతరం ప్రధానమంత్రి మోడీ ప్రసంగిస్తూ.. ప్రపంచంలో ఏ మూలన దాక్కున్నా ఉగ్రదాడికి కారణమైన వారిని పట్టుకొంటామని.. వేటాడి మట్టుబెడతామంటూ హెచ్చరిక చేయటం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి వేట ఇప్పటికే కాదు.. అతన్ని నిర్మూలించే వరకు సాగుతుందని మాత్రం చెప్పక తప్పదు.కాకుంటే.. అందుకు ఎంత సమయం పడుతుందన్నదే అసలు ప్రశ్న.