భర్తతో మేరీకోమ్ విడాకులు.. హితేశ్ తో డేటింగ్ పై క్లారిటీ!
భారత దిగ్గజ బాక్సర్, లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత మేరీకోమ్ తన వైవాహిక బంధం గురించి జరుగుతున్న ప్రచారంపై తొలిసారి స్పందించారు.
By: Tupaki Desk | 1 May 2025 10:23 AM ISTభారత దిగ్గజ బాక్సర్, లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత మేరీకోమ్ తన వైవాహిక బంధం గురించి జరుగుతున్న ప్రచారంపై తొలిసారి స్పందించారు. ఇందులో భాగంగా... తన భర్త కరుంగ్ ఓన్ కోలర్ తో సుమారు ఏడాదిన్నర క్రితమే విడిపోయినట్లు ఆమె ధృవీకరించారు. దీంతో.. జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ వచ్చినట్లయ్యింది.
అవును.. భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ వైవాహిక జీవితం గురించి జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ వచ్చింది. ఈ సందర్భంగా తను విడాకులు తీసుకున్నట్లు ఆమె కన్ ఫాం చేశారు. ఇదే సమయంలో.. పెద్దల సమక్షంలోనే విడాకుల ప్రక్రియ పూర్తైనట్లుగా ఆమె అధికారికంగా ప్రకటించారు. ఇదే సమయంలో ఆమె డేటింగ్ వార్తలపైనా క్లారిటీ వచ్చింది!
ఈ సందర్భంగా మేరీకోమ్ లాయర్ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. ఇందులో భాగంగా... మేరీకోమ్ కు ఓన్ కోలర్ కు మధ్య ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదని.. 2023 డిసెంబర్ 20న ఇద్దరూ పరస్పర అంగీకారంతో కోమ్ చట్టాల ప్రకారం కుటుంబ సభ్యులందరి సమక్షంలో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారని స్పష్టం చేశారు.
మరోపక్క... భర్తతో విడాకులతో పాటు హితేశ్ చౌధరీ అనే వ్యాపారవేత్తతో ఆమె బంధం గురించి కూడా తరచుగా కథనాలు వస్తున్న వేళ.. వాటిపైనా తన లాయర్ ద్వారా మేరీకోమ్ ఓ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. హితేశ్ చౌధరీతో తనకున్న బంధంపై స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు.
ఇందులో భాగంగా... హితేశ్ తో కానీ మరో బాక్సర్ భర్తతో కానీ ఆమెకు వ్యక్తిగత సంబంధం ఉన్నట్లుగా జరుగుతున్న ప్రచారం, వ్యాపిస్తున్న వదంతుల్లో వాస్తవం లేదని.. ఇకపై ఎవరూ దీన్నీ ప్రస్థావించరాదని.. మేరీకోమ్ ఫౌండేషన్ వ్యవహారాలు చూసే వ్యక్తిగా హితేశ్ తో వృత్తిపరమైన సంబంధం మాత్రమే ఉందని ఆమె లాయర్ ప్రకటించారు.
కాగా... ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన మణిపూర్ కి చెందిన 43 ఏళ్ల మేరీకోమ్.. కురుంగ్ ఓన్ కోలర్ ని 2025లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ముగ్గురు మగ పిల్లలు కాగా.. 2018లో ఒక పాపను దత్తత తీసుకున్నారు.
