Begin typing your search above and press return to search.

ఎంగేజ్మెంట్ అయిన 6992 రోజుల తర్వాత పెళ్లి!

యుక్త వయసు లో ఉన్నప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకున్న ఓ జంట.. ఏకంగా 19 ఏళ్ల తర్వాత వృద్ధాప్యంలో పెళ్లి పీటలెక్కింది.

By:  Tupaki Desk   |   30 July 2023 2:30 AM GMT
ఎంగేజ్మెంట్  అయిన 6992 రోజుల తర్వాత పెళ్లి!
X

సాధారణంగా నిశ్చితార్ధం అయిన రోజుల్లోనో, వారాల్లోనో, నెలల్లోనో పెళ్లి అయిపోతుంటుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే జంట మాత్రం నిశ్చితార్ధం అయిన 19ఏళ్ల తర్వాత పెళ్లిచేసుకుంది. అవును... ఎక్కాల్సిన ట్రైన్ జీవితకాలం ఆలస్యం అంటే ఇదే అనలేం కానీ... దాదాపుగా అదే అంటున్నారు నెటిజన్లు.

అవును... యుక్త వయసు లో ఉన్నప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకున్న ఓ జంట.. ఏకంగా 19 ఏళ్ల తర్వాత వృద్ధాప్యంలో పెళ్లి పీటలెక్కింది. ఆ జంటే... హాలీవుడ్ నటి, ఆస్కార్ విజేత మిచెల్లా యో - ఫార్ములా వన్ రేసర్ జేన్ టాడ్ట్! వీరి కథ ఏమిటనేది ఇప్పుడు చూద్దాం!

2004లో హాలీవుడ్ నటి, ఆస్కార్ విజేత మిచెల్లా యోకు.. ఫార్ములా వన్ రేసర్ జేన్ టాడ్ట్ ప్రపోజ్ చేశాడు. అయితే, అప్పటి నుంచి రిలేషన్‌ షిప్‌ లో ఉన్న ఈ జంట కు ఇన్నాళ్లకు పెళ్లి ఆలోచన వచ్చిందంట. దీంతో జెనీవా లో అత్యంత నిరాడంబరంగా అతి కొద్ది మంది బంధువులు, స్నేహితుల మధ్య వివాహం చేసుకున్నారు.

ఈ క్రమంలో... ఈ పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోల ను ఫార్ములా వన్ డ్రైవర్ ఫెల్పే మాసా తన ఇన్‌ స్టా ఖాతా లో షేర్ చేశారు. "హ్యాపీ మ్యారేజ్ జేన్ టోడ్ట్.. మిచెల్లా యో లవ్ యూ సో మచ్" అని క్యాప్షన్ పెట్టారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... ఇద్దరికీ 60 ఏళ్లు దాటడం!

ఇదే సమయం లో టాడ్ట్‌ తో తన పరిచయాన్ని షేర్ చేసుకోంది మిచెల్లా. ఇందులో భాగంగా 2004 జూన్ 4న షాంఘైలో తొలిసారి టాడ్ట్‌ ను కలిసినట్లు పేర్కొంది. ఆ కలయిక అనంతరం రెండు నెలల తర్వాత ఎంగేజ్మెంట్ జరిగిందని.. అప్పటి నుంచి రిలేషన్‌ షిప్‌ లో ఉన్నామని పేర్కొంది.

ఇదే క్రమంలో... "తామిద్దరం కలిసిన 6992 రోజుల తర్వాత ఈ రోజు 27 జులై 2023న జెనీవాలో కుటుంబసభ్యులు, స్నేహితుల మధ్య ఈ ప్రత్యేక క్షణాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది" అని ఆ నోట్ లో పేర్కొంది మిచెల్లా. ఈ సందర్భంగా సన్నిహితులతో దిగిన ఫోటోలను ఆమె కూడా షేర్ చేశారు.

కాగా.. టాడ్‌ తో రిలేషన్‌ షిప్‌ కి ముందు వ్యాపారవేత్త డిక్సన్ పూన్‌ ను 1988లో మిచెల్లా వివాహం చేసుకున్నారు. అయితే, రెండేళ్లకే వీరి వైవాహిక బంధం బీటలు వారింది. అనంతరం పూన్ నుంచి విడాకులు తీసుకున్న మిచెల్లా.. తాజాగా ఈ వయసు లో ఇప్పుడు టోడ్ట్‌ తో కొత్త జీవితం ప్రారంభించారు.