Begin typing your search above and press return to search.

మావో ఉద్యమానికి ఆయనతో ముగింపు ?

ఇక కేంద్ర ప్రభుత్వం అయితే దండకారణ్యం లక్షంగా చేసుకుని మావోల అంతానికి పట్టుదలగా చేసిన ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చాయి.

By:  Satya P   |   7 March 2026 9:20 AM IST
మావో ఉద్యమానికి ఆయనతో ముగింపు ?
X

భారత దేశ చరిత్రలో మావోయిస్టు ఉద్యమానికి కొన్ని పేజీలు ఉన్నాయి. ప్రజాస్వామ్య దేశంలో దానితో సమాంతరంగా సాయుధ పోరాటం నడచింది. ఆరు దశాబ్దాలకు పైగా సాగిన మావోల ఉద్యమం ఒక దశలో పాలకులకు పెను సవాల్ చేసింది. బ్యాలెట్ తో కాదు తుపాకీతోనే సాధించాలన్న మావోల సిద్ధాంతం ఆచరణలో ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని అంటారు. అడవులలో ఉంటూ జనానికి దూరంగా చేసిన పోరాటం వల్ల మెజారిటీ సెక్షన్ కి దూరం అయ్యారని కఠిన విశ్లేషణలు సైతం ఉన్నాయి. దండకారణ్యం కేంద్రంగా చేసుకుని ఏకంగా ఆరేడు రాష్ట్రాలలో తమ ఆధిపత్యం చూపించిన మావోల ఉద్యమం అయితే గత కొంతకాలంగా తగ్గుతూ వస్తోంది.

కొత్త రిక్రూట్మెంట్లు లేక :

ఇక మావోల ఉద్యమంలో ఫిలాసఫీ బలంగా ఉంటుంది. దాన్ని నమ్మి తొలి రెండు మూడు తరాలు అడవి బాట పట్టాయి. వారంతా వీరోచితంగా పోరాడారు. అయితే తరువాత తరాలకు మాత్రం ఆ ఫిలాసఫీని అందించడంతో కొంత గ్యాప్ కనిపించింది. దాంతో పాటు కొత్తగా రిక్రూట్మెంట్లు తగ్గడం కాలంతో పాటు మారకపోవడం వంటివి మావోల ఉద్యమానికి ప్రతికూల పరిస్థితులు తెచ్చి పెట్టాయని చెబుతారు.ఆపరేషన్ కగార్ తో కేంద్రం చేపట్టిన సీరియస్ యాక్షన్ తో మావోల ఉద్యమానికి కోలుకోలేని అతి పెద్ద దెబ్బ తగిలింది అని అంటున్నారు. ఏకంగా మావోల సాయుధ వ్యవస్థ కకావికలం అయ్యింది అని అంటున్నారు

కేంద్రం పట్టుదలగా :

ఇక కేంద్ర ప్రభుత్వం అయితే దండకారణ్యం లక్షంగా చేసుకుని మావోల అంతానికి పట్టుదలగా చేసిన ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చాయి. చాలా మంది ఈ పోరాటంలో అసువులు బాసారు, కొంతమంది అయితే లొంగుబాటు మార్గం అనుసరించారు. మావోలు అంతా ఇపుడు ఆలోచనలో పడే పరిస్థితి. చత్తీస్ ఘడ్ తెలంగాణ సరిహద్దులు అయిన కారేగుట్టల ప్రాంతంలో అతి తక్కువ మంది మాత్రమే మావోలు ఉన్నారని అంటున్నారు. ఆ నంబర్ కూడా పది నుంచి 15 మంది దాకా అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇపుడు ఒక సంచలన విషయమే వెలుగు చూస్తోంది మావోల ఉద్యమానికి ముగింపు పలికే కీలక ఘట్టంగా కూడా దీనిని భావిస్తున్న వారు ఉన్నారు.

గణపతి లొంగుబాటు అంటూ :

ఇక మావోల అగ్ర నేత గణపతి అలియాస్ ముప్పాళ్ళ లక్ష్మణ రావు లొంగుబాటలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఆయన వయసు డెబ్బై ఆరేళ్ళు. ఆయన ఇపుడు ఉద్యమ బాట వీడాలని జన జీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకున్నారు అని అంటునారు. దీంతో ఇపుడు ఈ అంశం జాతీయ స్థాయిలో అతి పెద్ద డిబేట్ గా మారింది. అయితే గణపతి ఎపుడు ఎక్కడ లొంగిపోతారు అన్నది కూడా ఉత్కంఠగా మారింది. ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో ఢిల్లీలో లొంగిపోతారు అని ఒక ప్రచారంలో ఉంది. అదే సమయంలో తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హైదరాబాద్ లో లొంగిపోతారు అని మరో వార్త చక్కర్లు కొడుతోంది.

ఈ నెల 8న సంచలన ప్రకటన :

ఇదిలా ఉంటే మావోయిస్టు గణపతి ఈ నెల 8న లొంగిపోతారు అని ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఆయనతో పాటు ఆయన భార్య సుజాత, కంపెనీ కమాండర్ కోర్సా లక్కు చలసాని నవత వంటివారు అలాగే సుమారు వంద మందికి పైగా మావోయిస్టులు కీలకమైన క్యాడర్ లో అగ్ర నాయకులు కూడా లొంగిపోతారు అని అంటున్నారు ఇదే కనుక జరిగితే మాత్రం మావోల చరిత్రలో అతి పెద్ద కుదుపుగానే భావించాలని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ నెలాఖరులోగా మావోయిస్టు ఉద్యమానికి ఎండ్ కార్డు వేస్తామని కేంద్రం పదే పదే చెబుతూ వస్తోంది. ఆ విధంగానే ఆపరేషన్ కగార్ సాగుతోంది. ఇక చూస్తే కనుక గత ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటిదాకా ఏకంగా 600 మంది దాకా కీలక మావోయిస్టు నేతలు లొంగిపోయారు అని అంటున్నారు. ఇక ఈ మధ్య కాలంలోనే తిప్పిరి తిరుపతి అలియాస్ దేవీజీ, మలా రాజిరెడ్డి అలియాస్ సంగ్రాం, బడే చొక్కారావ్ అలియాస్ దామోదర్, నూనె నరసిం హరెడ్డి వంటి అగ్ర నేతలే లొంగిపోయారు అని గుర్తు చేస్తున్నారు. వీరి లొంగుబాటుతో మావోల ఉద్యమానికి ముగింపు వచ్చినట్లే అన్న చర్చ అయితే సాగుతోంది.