Begin typing your search above and press return to search.

తన తాజా స్పీచ్ పై మనోజ్ క్లారిటీ... తెరపైకి టెక్నికల్ ప్రాబ్లం!

అవును... మోహన్ బాబు పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మైకందుకున్న మనోజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   21 March 2024 1:45 PM GMT
తన తాజా స్పీచ్  పై మనోజ్  క్లారిటీ... తెరపైకి టెక్నికల్  ప్రాబ్లం!
X

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పుట్టినరోజు, ఎంబీ యూనివర్శిటీ వార్షికోత్సవాన్ని పురష్కరించుకుని మంగళవారం సాయంత్రం తిరుపతిలో ఒక ప్రత్యేక కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... మనోజ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు ఎవరినో ఉద్దేశించే చేశారంటూ నెట్టింట ఒక చర్చ చెలరేగింది. దీంతో ఈ విషయంపై మనోజ్ క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా టెక్నికల్ సమస్యను ప్రస్థావించారు!

అవును... మోహన్ బాబు పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మైకందుకున్న మనోజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పదిమందితో కలిసి ముందుకుసాగే సరైన నాయకుడిని ఎన్నుకోండంటూ.. యువతను ఉద్దేశించి మనోజ్ వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యాఖ్యలకు ఇంటర్ ప్రిటేషన్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో... తన వ్యాఖ్యలపై స్పష్టత నిచ్చిన మనోజ్... తాను ఏ రాజకీయ పార్టీనీ ఉద్దేశించి మాట్లాడలేదని అన్నారు.

ఇందులో భాగంగా తన తండ్రి పుట్టినరోజు వేడుకల్లో ఏర్పడిన కొన్ని అపార్థాలు, పలు విషయాల గురించి ప్రస్థావించాలనుకుంటున్నానని అన్నారు. ఇందులో ప్రధానంగా... తన ప్రసంగం చుట్టూ అల్లుకున్న గందరగోళంపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు. రాజకీయ హద్దులు దాటి.. ఐక్యత, గౌరవంతో ముందుకుసాగాలన్నదే తన మాటల్లోని ఉద్దేశ్యం అని తెలిపారు. అయితే... దురదృష్టవశాత్తు లైవ్ స్ట్రీమింగ్ లో టెక్నికల్ సమస్యల కారణంగా కొన్ని కీలక అంశాలు ప్రసారం కాలేదని తెలిపారు.

దీంతో... అది కాస్తా తప్పుడు అర్థాలకు దారితీసిందని అన్నారు. ఇక.. తాను ఏదో ఒక రాజకీయ పార్టీ నాయకుడిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని.. తనకు ఏ రాజకీయపార్టీతోనూ సంబంధాలు లేవని.. టెక్నికల్ గా తలెత్తిన సమస్యల గురించి క్షమాపణలు చెప్పిన టీం కు ధన్యవాదలని తెలిపిన మనోజ్... నాడు ఆ సభలో తాను మాట్లాడిన పూర్తి స్పీచ్ ని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఒక నటుడిగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే తన లక్ష్యమని పోస్ట్ చేశారు.

కాగా... మోహన్ బాబు బర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన మనోజ్ మాట్లాడుతూ... అందరితోనూ కలిసి ముందుకు వెళ్తున్నాడా.. లేక, ఏమైనా దారుణాలకు పాల్పడుతున్నాడా అనే విషయాలను విశ్లేషించి, 10మందితో కలిసి ముందుకు సాగే సరైన నాయకుడిని ఎన్నుకోండి. కుటుంబానికి, చుట్టుపక్కల వాళ్లకే సాయం చేయలేని వారు మీకేమి సాయం చేస్తారు.. అది గుర్తుపెట్టుకోండి! డబ్బులు ఇచ్చారని ఓటు వేయొద్దు.. మీకు నచ్చిన వాళ్లని ఎన్నుకోండి అని ప్రసంగించిన సంగతి తెలిసిందే!