వెయ్యికి పైగా క్రెడిట్ కార్డులు.. ఎలా వినియోగిస్తున్నాడంటే..?
అధునాతన ఆర్థిక వ్యవస్థలో క్రెడిట్ కార్డు ఒక సాధనం మాత్రమే కానీ, అవే కార్డులు వందలు దాటి, వేలల్లోకి వస్తే.. ఆశ్చర్యానికి గురవడం మనవంతు అవుతుంది.
By: Tupaki Desk | 7 Oct 2025 6:00 PM ISTకొవిడ్ నుంచి అనుకుంటా.. క్రెడిట్ కార్డుల వినియోగం బాగా పెరిగింది. కాంటాక్ట్ లెస్ లావాదేవీలు వినియోగించాలన్న నిబంధనలతో కార్డులు ఎక్కువగా చలామణిలోకి వచ్చాయి. దీనికి తోడు ఆర్థికంగా మరింత వెసులు బాటు కలగించాలని ప్రధాని ఆదేశాలతో బ్యాంకులు సైతం విరివిగా కార్డులను జారీ చేశాయి. అయితే ఇందులో లాభం ఎంత ఉందో నష్టం కూడా లేకపోలేదు. ఏదైనా పద్ధతిగా వినియోగిస్తే.. ఒకే.. లేదంటే కష్టాలకు ఎదురు నిలవాల్సిందే.
డిజిటల్ కాలంలో కార్డుల అవసరం తప్పనిసరి..
అధునాతన ఆర్థిక వ్యవస్థలో క్రెడిట్ కార్డు ఒక సాధనం మాత్రమే కానీ, అవే కార్డులు వందలు దాటి, వేలల్లోకి వస్తే.. ఆశ్చర్యానికి గురవడం మనవంతు అవుతుంది. ఒక వ్యక్తి వద్ద 1638 క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ఈ సంఖ్య తెలిసి ప్రతి ఒక్కరూ అవాక్కవుతున్నారు. మనీశ్ ధామేజా అనే వ్యక్తి ఈ అసాధారణ ‘కలెక్షన్’ చేసిన వ్యక్తి. పాత నోట్ల రద్దు సమయం నుంచి తీసుకుంటున్న ఈ కార్డులతో భారీగా లావాదేవీలు చేపట్టినట్లు చెప్తున్నాడు.
విరివిగా ఇస్తున్న బ్యాంకులు..
బ్యాంక్ ఖాతా కలిగిన ఉన్న దాదాపు ప్రతి వ్యక్తికి ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక కాల్ క్రెడిట్ కార్డు డిపార్ట్ మెంట్ నుంచి వస్తూనే ఉంటుంది. కొత్త కార్డు కావాలా..? పాత కార్డు ఆధారంగా కొత్త కార్డు.. కొత్త కార్డు అప్ డేట్ చేస్తాం.. ఇలా వస్తూనే ఉంటాయి. అయితే దీనిలో మంచి ఎంత ఉందో.. చెడు కూడా లేకపోలేదు.
సిస్టం వైఫల్యం కిందనే చూడాలా..?
ఇప్పుడు మనీష్ ధావేజాను ఉదాహరణగా తీసుకుంటే ఒక వ్యక్తి వద్ద 1638 క్రెడిట్ కార్డులు ఉండడం సిస్టమ్ వైఫల్యంకు ప్రతీక అనుకోవచ్చు. బ్యాంకుల ధృవీకరణ వ్యవస్థలు, కేవైసీ (KYC) ప్రక్రియలు, ఫిన్‌టెక్ సంస్థల పర్యవేక్షణలన్నీ ప్రశ్నార్థకంగా మారుతాయి. ఒకే వ్యక్తి ఈతరహా ఖాతాలు తెరవగలడంటే, భద్రతా ఏ మేరకు ఉంటుందనేది ప్రశ్నార్థకమే.
బ్యాంకులు పరిశీలిస్తున్నాయా..?
క్రిడిట్ కార్డులు జారీ చేసే బ్యాంకులు కొన్ని నిబంధనలు పాటిస్తుంటాయి. కానీ మనీష్ విషయంలో ఏం చేశాయన్న ప్రశ్న తలెత్తుతోంది. సాధారణంగా ఎంత ట్రాన్ జాక్షన్ ఉన్నా.. క్రెడిట్ కార్డులు ఎక్కువగా ఉంటే సిబిల్ కు గట్టి దెబ్బే అని ఆర్థిక నిపుణులు చెప్తుంటారు. అలాంటి సిబిల్ బేస్ పైనే కార్డులు జారీ చేస్తున్నారా? అన్న ప్రశ్న కలుగకమానదు. ఇంత ఆర్థిక మోసాలు జరుగుతున్న కాలంలో కూడా ఇన్ని కార్డులు అదీ ఒకే వ్యక్తికి కేటాయించడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం.
మనీశ్ ధామేజా మనకు ఒక హెచ్చరిక.. టెక్నాలజీ కేవలం సాధనం మాత్రమే దాన్ని ఎలా వాడతామనే విషయం మన చేతుల్లోనే ఉంది. డిజిటల్ భద్రత, ఆర్థిక నైతికత, వ్యవస్థల పారదర్శకత ఈ మూడు అంశాల సమతుల్యత ఉండాలని చెప్పకనే అర్థం చేసుకోవాలి.
