Begin typing your search above and press return to search.

మంగ్లీ.. ఏంది ఇదీ

మంగ్లీ ఫోక్ గీతాలు, బతుకమ్మ, బోనాలు వంటి తెలంగాణ సంప్రదాయ పాటలతో పాటు పలు సినిమాల్లో పాటలు పాడి మంచి పేరు సంపాదించుకుంది.

By:  Tupaki Desk   |   11 Jun 2025 1:48 PM IST
మంగ్లీ.. ఏంది ఇదీ
X

ఫోక్ సింగర్‌గా పేరు సంపాదించుకున్న మంగ్లీ బర్త్ డే వేడుకలు పెద్ద దుమారం రేపాయి. మంగళవారం రాత్రి చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ తన సన్నిహిత స్నేహితులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఈ వేడుక గురించి ముందస్తు సమాచారం అందుకున్న పోలీసులు అకస్మాత్తుగా రిసార్ట్ పై దాడులు చేశారు.

పోలీసుల తనిఖీల్లో అక్కడ భారీగా గంజాయి, విదేశీ మద్యం నిల్వలు లభ్యమయ్యాయి. బర్త్ డే పార్టీకి హాజరైన పలువురిని వైద్య పరీక్షలకు పంపగా, వారి రక్త నమూనాల్లో మాదకద్రవ్యాల అవశేషాలు ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో వారి మీద కేసులు నమోదు చేసినట్టు చేవెళ్ల పోలీసులు వెల్లడించారు.

ఈ ఘటనపై పూర్తి సమాచారం ఇవ్వడానికి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మంగ్లీ పార్టీకి హాజరైన వారి జాబితా, పాజిటివ్ వచ్చిన వారి వివరాలు ఇంకా వెల్లడించలేదు. అయితే ఈ వార్త టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

మంగ్లీ ఫోక్ గీతాలు, బతుకమ్మ, బోనాలు వంటి తెలంగాణ సంప్రదాయ పాటలతో పాటు పలు సినిమాల్లో పాటలు పాడి మంచి పేరు సంపాదించుకుంది. న్యూస్ యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన మంగ్లీ, ప్రస్తుతం పాపులర్ ప్లేబ్యాక్ సింగర్ గా ఎదిగింది.

ఈ వివాదం కారణంగా మంగ్లీ ఇమేజ్‌కు ఎలాంటి దెబ్బ తగలబోతుందోనని అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు ఆమె నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాకపోవడంతో ఉత్కంఠ నెలకొంది.

పూర్తి దర్యాప్తు తర్వాత అసలు నిజాలు బయట పడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.