రాష్ట్రంలో రాజుల పాలన: పవన్
తాజాగా మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో రాష్ట్రంలోని సర్పంచులతో పవన్ భేటీ అయ్యారు.
By: Tupaki Desk | 5 Aug 2023 10:01 PM ISTఏపీలో ప్రజాస్వామ్య తరహా పాలన సాగడం లేదని, రాజుల పాలన సాగుతోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రతి పనికీ జీ హుజూర్ అంటూ.. వైసీపీ నాయకులు, పాలకుల ముందు చేతు లు కట్టుకునే పరిస్థితి కల్పించారని అన్నారు. మేం ఏం చేసినా.. మమ్మల్ని ఎవరూ అడగకూడదు.. ప్రశ్నించకూడదు అనే తరహాలో ఒకప్పుడు రాజులు ఉండేవారని..ఇప్పుడు ఏపీలోనూ అదే జరుగుతోంద ని ఆయన చెప్పుకొచ్చారు.
తాజాగా మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో రాష్ట్రంలోని సర్పంచులతో పవన్ భేటీ అయ్యా రు. ఈ సందర్భంగా వారి సమస్యలు విన్నారు. పంచాయతీల నిధులను ప్రభుత్వమే వాడేసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని.. అయినా.. అదేమని అడిగితే సమాధానం చెప్పే వారు కూడా లేరని అన్నారు.
చివరకు సర్పంచ్‌లు నిధుల కోసం రోడ్లపైకి రావాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. పంచాయతీల నిధులను ప్రభుత్వమే వాడుకుంటోందని కేంద్ర ప్రభుత్వమే చెప్పిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
"రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ జరగాలి. గ్రామీణ ప్రజల సొమ్మును దొచుకుంటున్నారు. గ్రామ పాలన కూడా సీఎం కార్యాలయం నుంచే జరగాలనుకోవడం సరికాదు. స్థానిక సంస్థలకు రాజ్యాంగపరంగా దక్కిన అధికారాలు లేకుండా చేస్తున్నారు.
మన రాష్ట్రంలో ఇంకా రాజుల తరహా పాలనే సాగుతోంది. కేంద్రం ఇచ్చే నిధుల నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాలోకి రావాలి. గ్రామ పంచాయతీలకు ఇచ్చే నిధుల విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా" అని పవన్ వివరించారు.
కేరళ రాష్ట్రంలో అమలు చేస్తున్న పంచాయతీ రాజ్ వ్యవస్థపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంద ని పవన్ అన్నారు. చెక్ పవర్ సర్పంచ్‌లకే ఉండాలన్నారు. వలంటీరు వ్యవస్థ, గ్రామ సచివాలయం వ్యవస్థలు కాంప్లిమెంటరీ సంస్థలుగా పేర్కొన్నారు. వలంటీరు, సచివాలయం ఉద్యోగులు అధికార పార్టీ కార్యకర్తలని అన్నారు. జనసేన అధికారంలోకి వస్తే.. సర్పంచులకు సర్వాధికారులు కల్పిస్తామని చెప్పారు.
