కొత్త నేత: మండపల్లి ఛాన్స్ ఇవ్వట్లేదుగా ..!
ఇటు నియోజకవర్గంలోను..అటు ప్రభుత్వం పరంగా కూడా మండపల్లి రికార్డులు సొంతం చేసుకుంటు న్నారనే చెప్పాలి.
By: Tupaki Desk | 28 July 2025 3:00 AM ISTకొత్తగా వచ్చినా.. కూడా కొందరు నాయకుల పనితీరు ప్రశంసలు కురిపిస్తోంది. ప్రజలకు చేరువగా ఉండడంతో పాటు.. పనితీరు విషయంలోనూ రాజీలేని ధోరణితో ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వం తరఫున బలమైన వాయిస్ వినిపిస్తున్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నారు. ఇలాంటి వారిలో మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి ఒకరు. రవాణా శాఖ మంత్రిగా ఉన్న మండపల్లి..వైసీపీకి కంచుకోట వంటి రాయచోటి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్నారు. యువతను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ఆయనకు అవకాశం ఇచ్చారు.
ఇటు నియోజకవర్గంలోను..అటు ప్రభుత్వం పరంగా కూడా మండపల్లి రికార్డులు సొంతం చేసుకుంటున్నారనే చెప్పాలి. దూకుడు నాయకుడు కాకపోయినా.. పనితీరు బాగున్న మంత్రుల్లో మండపల్లి కూడా ఉ న్నారు. ప్రస్తుతం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని సర్కారు త్వరలోనే అందుబాటులోకి తీసుకురా నుందన్న చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి ప్రచారం చేస్తున్నారు మంత్రి. అదేసమయంలో ఏడా ది కాలంలో ప్రభుత్వం చేపట్టిన పనులు, చేసిన సంక్షేమాన్నికూడా ఆయన ప్రజలకు వివరిస్తున్నారు.
మంత్రిగా మంచి మార్కులే వేయించుకున్న మండపల్లి.. చంద్రబాబు టీంలో గుడ్ మినిస్టర్ అనదగ్గ స్థాయిలోనే ఉన్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అటు రాయచోటి నియోజకవర్గంలో కూడా.. మంత్రి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. బలమైన నాయకుడిగా ఉన్నగడికోట శ్రీకాంత్ రెడ్డిపై గత ఎన్ని కల్లో విజయం దక్కించుకున్నప్పటికీ.. ఎప్పటికప్పుడు అప్రమత్తంగానే ఉంటున్నారు. కూటమి పార్టీల తోనూ సఖ్యతగా ముందుకు సాగుతున్నారు. ఇదే మండపల్లికి మంచి మార్కులు వేసేలా చేసింది.
ఇక, ప్రభుత్వం చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని విజయం చేసేందుకు మంత్రి ప్రయ త్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ.. వైసీపీ ఏడాది పాలనకు ప్రస్తుత కూటమి సర్కారు 12 నెలల పాలనకు కంపేర్ చేసి వివరిస్తున్నారు. అదేసమయంలో కూటమి ప్రభుత్వం మళ్లీ-మళ్లీ వస్తుందని కూడా చెప్పడం ద్వారా ప్రజల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. మరో చిత్రమైన విషయం ఏంటంటే.. ఆయన ఎక్కడికి వెళ్లినా కూటమి పార్టీలకు చెందిన నాయకులను పక్కనే పెట్టుకుని వివాదాలకు దూరంగా వ్యవహరిస్తున్నారు. ఇలా.. మంత్రి మండపల్లి చంద్రబాబు టీంలో మంచి పేరు తెచ్చుకోవడం గమనార్హం.
