అన్న ఫస్ట్ నైట్ చూడాలనుకున్న తమ్ముడు.. సన్ సైడ్ ఎక్కి ఏం చేశాడంటే ?
పెళ్లి అనేది ఒక పవిత్రమైన బంధం. మొదటి రాత్రి (శోభనం) నూతన దంపతులకు ఎంతో ప్రత్యేకమైనది.
By: Tupaki Desk | 17 April 2025 9:18 AMపెళ్లి అనేది ఒక పవిత్రమైన బంధం. మొదటి రాత్రి (శోభనం) నూతన దంపతులకు ఎంతో ప్రత్యేకమైనది. ఎన్నో ఆశలు, ఊహలతో ఆ గదిలోకి అడుగుపెడతారు. అయితే, ఓ ఘనుడు మాత్రం ఈ పవిత్రమైన క్షణాలను తన వికృత చేష్టతో భంగం కలిగించాడు. సొంత అన్న శోభనం గదిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే దుర్బుద్ధితో దొంగలా చొరబడి ఏకంగా కెమెరా పెట్టి రికార్డ్ చేయబోయాడు. అతడు చేసిన పనికి అందరూ షాకయ్యారు. ఇంతకీ ఆ ఘనుడు ఏం చేశాడంటే...
కొత్తగా పెళ్లయిన జంట కోసం కుటుంబ సభ్యులు శోభనం ఏర్పాటు చేశారు. కొంచెం భయంగా, కొంచెం ఆత్రుతగా నూతన దంపతులు గదిలోకి ప్రవేశించారు. అయితే, వారికి తమ గదిలో ఎవరో ఉన్నారనే అనుమానం కలిగింది. అనుమానంతో గది అంతా వెతకగా, సన్సైడ్ మీద ఒక వ్యక్తి దాక్కొని ఉండటం చూసి షాకయ్యారు. వెంటనే అతన్ని బయటకు రమ్మని గట్టిగా హెచ్చరించారు. వారి కేకలు విన్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని ఆ వ్యక్తిని పట్టుకున్నారు.
లోపల ఏం చేస్తున్నావని నిలదీయగా, అతను చెప్పిన సమాధానం విని అందరూ అవాక్కయ్యారు. శోభనం రోజు ఏం జరుగుతుందో తనకు తెలియదని, అందుకే తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో నూతన జంట రాకముందే గదిలో దాక్కున్నానని చెప్పాడు. అంతేకాదు, గదిలో కెమెరా పెట్టి అటక మీద దాక్కొని అంతా రికార్డ్ చేయాలనుకున్నానని కూడా చెప్పాడు. అయితే, రికార్డ్ చేసేలోపే నూతన దంపతులు అతన్ని గుర్తించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు ఆ యువకుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఫస్ట్ నైట్ రూమ్లో దాక్కున్న వ్యక్తిని బయటకు లాగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా పిచ్చి ఎక్కువైపోయిందని, ఇలాంటి దిక్కుమాలిన చేష్టలు హద్దులు దాటుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.