Begin typing your search above and press return to search.

కేవలం రూ.1000కే గూగుల్.కామ్ సొంతం చేసుకున్న భారతీయుడు

ఆ రోజు రాత్రి, సన్మయ్ వేద్ గూగుల్ డొమైన్స్ వెబ్‌సైట్‌లో డొమైన్ పేర్లను పరిశీలిస్తున్నాడు.

By:  Tupaki Desk   |   11 April 2025 4:23 AM
He Bought Google.com for $12  The Story of Sanmay Ved
X

ప్రపంచంలోనే అత్యంత విలువైన వెబ్‌సైట్, మీరు రోజూ వాడుతున్న గూగుల్.కామ్‌ను ఒక సాధారణ వ్యక్తి కొనేస్తే? అది కూడా పిజ్జా కొనే డబ్బులతో! నమ్మడానికి కష్టంగా ఉన్నా, 2015లో గుజరాత్‌కు చెందిన ఒక మాజీ గూగుల్ ఉద్యోగి నిజంగానే ఇది చేశాడు. రాత్రిపూట సరదాగా డొమైన్‌లు చూస్తుండగా అతని కంటపడిన ఒక అద్భుతం.. క్షణాల్లో అతన్ని ప్రపంచాన్నే శాసించే వెబ్‌సైట్‌కు యజమానిని చేసింది. ఇంతకీ ఏం జరిగింది? ఆ వ్యక్తి ఎలా కొన్నాడు? గూగుల్ ఏం చేసింది? ఈ కథనంలో తెలుసుకుందాం.

2015లో ఒక అసాధారణమైన సంఘటన చోటుచేసుకుంది. గుజరాత్‌లోని మాండవికి చెందిన సన్మయ్ వేద్, గతంలో గూగుల్‌లో పనిచేసిన ఒక సామాన్య వ్యక్తి, క్షణకాలం ప్రపంచంలోనే అత్యధికంగా సందర్శించే వెబ్‌సైట్ అయిన Google.com యజమాని అయ్యాడు. అది కూడా కేవలం $12 డాలర్లకు మాత్రమే!

ఆ రోజు రాత్రి, సన్మయ్ వేద్ గూగుల్ డొమైన్స్ వెబ్‌సైట్‌లో డొమైన్ పేర్లను పరిశీలిస్తున్నాడు. అప్పుడు అతనికి ఆశ్చర్యం కలిగించే విషయం కనిపించింది - "google.com" కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది! మొదట అది ఒక సాంకేతిక లోపం అయి ఉంటుందని భావించిన వేద్, సరదాగా ఆ డొమైన్‌ను తన షాపింగ్ కార్ట్‌కు జోడించాడు. అతని ఆశ్చర్యానికి అవధులు లేకుండా పోయాయి, ఎందుకంటే ఆ లావాదేవీ విజయవంతంగా పూర్తయింది.

వెంటనే అతని క్రెడిట్ కార్డ్ నుండి $12 డెబిట్ అయ్యాయి. అంతేకాదు, అతను తాత్కాలికంగా గూగుల్ వెబ్‌మాస్టర్ టూల్స్‌కు యాక్సెసబులిటీని పొందాడు. ఇది అతను ఆ డొమైన్‌కు యజమాని అయ్యాడని స్పష్టంగా కన్ఫాం అయింది. క్షణకాలం ప్రపంచ ఇంటర్నెట్‌ను శాసించే శక్తి అతనికి వచ్చింది. అయితే, ఇది కేవలం ఒక సాంకేతిక లోపం కారణంగా జరిగిందని తర్వాత తేలింది. గూగుల్ వెంటనే ఆ డొమైన్‌ను తిరిగి తమ ఆధీనంలోకి తీసుకుంది. ఈ సంఘటన మాత్రం ఇంటర్నెట్ చరిత్రలో ఒక ఆసక్తికరమైన, నమ్మలేని కథగా నిలిచిపోయింది.