Begin typing your search above and press return to search.

ముఖ్యమంత్రి సువేందుకు మమత మార్క్ షాక్

ఒకనాడు శిష్యుడు ఈ రోజు తన సీఎం కుర్చీ లాగేసి ఆ మీదట తన పార్టీ వారిని కూడా ఆకట్టుకుని అసలు తృణమూల్ కాంగ్రెస్ నే ఏమీ కాకుండా లేకుండా చేయాలని చేస్తున్న ప్రయత్నాలతో బెంగాల్ బెబ్బులి

By:  Satya P   |   17 Jun 2026 9:42 AM IST
ముఖ్యమంత్రి సువేందుకు మమత మార్క్ షాక్
X

ఒకనాడు శిష్యుడు ఈ రోజు తన సీఎం కుర్చీ లాగేసి ఆ మీదట తన పార్టీ వారిని కూడా ఆకట్టుకుని అసలు తృణమూల్ కాంగ్రెస్ నే ఏమీ కాకుండా లేకుండా చేయాలని చేస్తున్న ప్రయత్నాలతో బెంగాల్ బెబ్బులి మమతా బెనర్జీ రగిలిపోతున్నారు. ఒకనాడు కను రెప్పతో శాసించిన పశ్చిమ బెంగాల్ లో ఆమె ఒంటరి పోరాటం చేస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో నమ్మిన వారు అంతా గుడ్ బై చెప్పేస్తూంటే తల్లడిల్లిపోతున్నారు. ఇంత ప్రతికూల పారిస్థితులలోనూ పోరాటాన్నే చేయాలని డెబ్బై రెండేళ్ల మమతా బెనర్జీ నిర్ణయించుకోవడమే రాజకీయ విశేషం.

న్యాయ పోరాటంతో :

ఇక మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ భవానీపూర్ నుంచి పోటీ చేశారు. అక్కడ ఆమె ప్రత్యర్ధిగా బీజేపీ నుంచి సువేందు అధికారి పోటీ చేశారు. ఆయన నందిగ్రాం తో పాటు రెండవ సీటుగా భవానీపూర్ ని ఎంచుకున్నారు. రెండు చోట్లా సువేందు గెలిచారు. అంతే కాదు భవానీపూర్ లో మమత మీద ఏకంగా 15,015 ఓట్ల భారీ తేడాతోనే ఘన విజయం సాధించారు. అయితే తన ఓటమిని ఎపుడూ ఒప్పుకోని మమత కాస్తా లేటు అయినా లేటెస్ట్ గా భవానీపూర్ ఎన్నికల ఫలితం మీద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ విధంగా ఆమె భవానీపూర్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయిన సువేందు అధికారిని గట్టిగానే సవాల్ చేశారు.

కౌంటింగులో అక్రమాలు అంటూ :

భవానీపూర్ ఎన్నికల ఫలితాలని లెక్కింపు చేసే ప్రక్రియలోనే అక్రమాలు జరిగాయని మమత ఆరోపించారు. మమత స్వయంగా కోల్ కత్తాలోని హైకోర్టుకు వెల్ళి మరీ ఎన్నికల పిటిషన్ దాఖలు చేయడం విశేషం. గతంలో అంటే 2021లో కూడా మమత నందిగ్రాం ఎన్నికల ఫలితం మీద కోర్టుకు ఎక్కారు. ఈసారి భవానీపూర్ మీద ఆమె న్యాయ పోరాటం చేస్తున్నారు .

జీర్ణించుకోలేకపోతున్న దీదీ :

తన ఓటమిని మమతా బెనర్జీ ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు అని అంటున్నారు. పార్టీ ఓడిపోవడం ఒక ఎత్తు అయితే తాను కూడా స్వయంగా ఓటమి పాలు కావడం ఆమె ఏ మాత్రం సహించలేకపోతున్నారు అని అంటున్నారు. అక్రమాలు లెక్కింపులోనే జరిగాయని ఆమె ఆరోపిస్తున్నారు. అంతే కాదు ఫలితాల మీద విచారణ జరిపించలాని అంతవరకూ ఎన్నికలకు సంబంధించిన అన్ని రికార్డులను భద్రపరచాలని ఆమె పిటిషన్ లో కోరారు.

సువేందు రియాక్షన్ :

ఇదిలా ఉంటే తన గెలుపు మీద మమతా బెనర్జీ వేసిన పిటిషన్ గురించి ముఖ్యమంత్రి సువేందు అధికారి అయితే ఇప్పటిదాకా స్పందించలేదు. అలాగే బీజేపీ నుంచి ఏ రకమైన కామెంట్స్ రాలేదు. అతి తక్కువ ఓట్ల తేడాత్లో 2021లో నందిగ్రాం లో ఓడినపుడు పిటిషన్ దాఖలు చేసిన మమత ఇపుడూ ఇంకా భారీ మెజారిటీతో సువేందు గెలిచినా మళ్ళీ అదే పనిచేశారు. నంద్రిగ్రాం కేసులో అయితే పెటిషన్ ఇప్పటికీ పెండింగులో ఉందని చెబుతున్నారు. మరి ఈ తాజా పిటిషన్ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అన్నది చూడాలి. ఇవన్నీ పక్కన పెడితే తాజా పరిణామంతో సువేందు అధికారి వర్సెస్ మమతా మధ్య రాజకీయ రచ్చ మరో రూపు దాల్చింది అని అంటున్నారు. ఎవరు ఎవరి మీద పైచేయి సాధిస్తరో చూడాల్సి ఉంది మరి అని అంటున్నారు. అయితే తృణమూల్ మూలాలను ఇప్పటికే తుదముట్టించే పనిలో సువేందు అధికారి బిజీగా ఉన్నారని అంటున్నారు.