Begin typing your search above and press return to search.

లాయర్ అవతార్...మమత వ్యూహం సక్సెస్

బీజేపీకి అనుకూలంగా సర్ ప్రక్రియ సాగుతోంది అని ఆమె ఆరోపిస్తూ వస్తున్నారు దీని వల్ల అసలైన ఓటర్లకు తీరని అన్యాయం జరుగుతోందని ఆమె ఏకంగా గర్జిస్తున్నారు.

By:  Satya P   |   11 Feb 2026 4:00 PM IST
లాయర్ అవతార్...మమత వ్యూహం సక్సెస్
X

మమతా బెనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, ఎడారిగా మారిన చోట వర్షాలను కురిపించిన రాజకీయ మేటిగా చూడాలి. వామపక్షాలకే అంకితం అయి దశాబ్దాల పాటు వారికి కంచుకోటగా మారిన పశ్చిమ బెంగాల్ లో కాంగ్రెస్ అంటే దాదాపుగా అంతా మరచిపోయారు. ఆ పార్టీ నుంచి 1984లో తొలిసారి గెలిచిన మమతా బెనర్జీ పదిహేనేళ్ళ పాటు కాంగ్రెస్ లోనే ఉంటూ లెఫ్ట్ పార్టీల మీద పోరాటం చేశారు ఇక అలా లాభం లేదని తృణమూల్ కాంగ్రెస్ ని స్థాపించి తానే నేరుగా బరిలోకి దిగారు, కమ్యూనిస్టులకు ముచ్చేమటలు పట్టించారు. సింగూరు, నందిగ్రాం వంటి భారీ ఉద్యమాలతో మమత అపర కాళిక అవతారమే ఎత్తారు, కమ్యూనిస్టులకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. ఎట్టకేలకు ఆమె పోరాటం, రాజకీయ వ్య్హూహాలు అన్నీ ఫలించి 2011లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా తొలిసారి అధికారం అందుకున్నారు.

పోరాటలకు మారు పేరు :

మమతా బెనర్జీ పోరాటాలకు పెట్టింది పేరు. ఆమె ఉద్యమించారు అంటే లక్ష్యం చేరేదాకా విశ్రమించారు. అసమానమైన ధైర్య సాహసాలతో పాటు వ్యూహాలు ఎత్తుగడలతో ఆమె దూసుకుని పోయే రాజకీయ దిగ్గజంగా చెబుతారు. ఇపుడు ఆమె నాలుగవసారి సీఎం కావాలని చూస్తున్నారు. మరి కొద్ది నెలలలోనే పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. బీజేపీ 2021లో నేలా నింగీ రెండిటినీ కలుపుతూ ఇక మాదే అధికారం మమత ఓటమి ఖాయమని భారీ ఎత్తున ఆర్భాటం చేసింది. అయినా మరిన్ని ఎక్కువ సీట్లు గెలిచి మమత హ్యాట్రిక్ సీఎం అయ్యారు. దటీజ్ మమతా అనిపించుకున్నారు.

ఈసారి కొత్త స్ట్రాటజీతో :

ఇక ఈసారి మమత సరికొత్త స్ట్రాటజీతో ముందుకు సాగుతున్నారు. బీజేపీకి అనుకూలంగా సర్ ప్రక్రియ సాగుతోంది అని ఆమె ఆరోపిస్తూ వస్తున్నారు దీని వల్ల అసలైన ఓటర్లకు తీరని అన్యాయం జరుగుతోందని ఆమె ఏకంగా గర్జిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ఏకంగా సుప్రీం కోర్టు దాకా వెళ్ళారు. సర్ ప్రక్రియ బెంగాల్ లో అస్తవ్యస్థంగా సాగుతోందని అర్హులైన వారి ఓట్లు గల్లంతు అవుతున్నాయని ఆమె ఆరపొఇంచారు. లక్షలలో ఓట్లు లేకుండా చేస్తున్నారు అని అన్నారు. దీని మీద సుప్రీం కోర్టు ముందు ఆమె ఒక లాయర్ గా అవతారం ఎత్తి మరీ తన కేసుని తానే వాదించారు. ఈ విధంగా ఆమె పశ్చిమ బెంగాల్ ప్రజలనే కాదు దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఇక సుప్రీం కోర్టు గల్లంతు అయిన ఓట్ల విషయంలో చూడాలని ఈసీని ఆదేశించింది.

జనాల్లోకి సందేశం :

మమత ఎందుకు లాయర్ అవతారం ఎత్తారు అన్నదే ఇక్కడ ప్రశ్న. మామూలుగా అయితే రాజకీయ నాయకులు వేసే కేసులలో ఎవరో లాయర్లను పెట్టి వాదించుకుంటారు. కానీ మమతే స్వయంగా ఈ కేసు విషయంలో వాదించడం వెనక పక్కా వ్యూహం ఉంది అని అంటున్నారు. తానే స్వయంగా న్యాయం కోసం సుప్రీం కోర్టు దాకా వెళ్ళానూ అంటే సర్ ద్వారా జరిగే దారుణాలు ఎంత తీవ్రమైనవో పశ్చిమ బెంగాల్ జనాలకు చెప్పాలన్నదే ఆమె ప్రధాన్ ఉద్దేశ్యం అని అంటున్నారు. తన పేరు అలా బెంగాల్ జనాల నోళ్ళలో నానాలని, తాను చేస్తున్న కార్యక్రమాలు కానీ బీజేపీతో పోరాడుతున్న విషయం కానీ ఎంతో న్యాయసమ్మతమైనవి అని చాటి చెప్పడానికే మమత సుప్రీం కోర్టు మెట్లు ఎక్కారని లాయర్ గా వ్యవహరించారని అంటున్నారు. ఈ విషయంలో మమత సక్సెస్ అయినట్లుగానే ఉంది అని అంటున్నారు.

మమతకు కావాల్సింది ఇదే :

ఇపుడు బెంగాల్ అంతా సర్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఒక ముఖ్యమంత్రి న్యాయవాదిగా కోర్టు దాకా వెళ్ళి తమ పక్షాన నిలిచి వాదించారు అన్నది జనంలోకి బలంగా వెళ్ళింది. మమతకు కావాల్సింది ఇదే. తమ ఓట్లు పోతున్నాయని జనం నుంచి ఆగ్రహం రావాలని అది పెద్ద డిబేట్ కావాలని చివరికి అది బీజేపీ మీద వ్యతిరేకతగా మారాలని మమత వేసిన ఈ ఎత్తుగడ ఇపుడు మంచి ఫలితమే ఇస్తోంది అని అంటున్నారు. నాలుగవసారి వరసగా గెలవడానికి మమత వేసిన ఈ మాస్టర్ ప్లాన్ తో సరికొత్త ఇమేజ్ ని ఆమె బెంగాల్ లో క్రియేట్ చేసుకోగలిగారు అని అంటున్నారు. ఇక స్వతహాగా మమత లాయర్ అన్నది చాలా మందికి తెలియదు. ఆమె న్యాయ విద్యను అభ్యసించారు. దానిని సరైన సమయంలో ఉపయోగించారు అని అంటున్నారు. తాజా పరిణామాలతో మమత తన ప్రతిష్టను బాగా పెంచుకోగా కాషాయ దళం ఆమె ఎత్తుకు పై ఎత్తు ఏమి వెస్తుంది అన్నదే చర్చగా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.