Begin typing your search above and press return to search.

20 ఎంపీలు బీజేపీలోకి...మమతకు బిగ్ షాక్ ?

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇపుడు రాజకీయ నిస్సహాయకురాలిగా కనిపిస్తున్నారు.

By:  Satya P   |   8 Jun 2026 9:50 AM IST
20 ఎంపీలు బీజేపీలోకి...మమతకు బిగ్ షాక్ ?
X

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇపుడు రాజకీయ నిస్సహాయకురాలిగా కనిపిస్తున్నారు. అధికారాంతమున ఆమెకు అన్నీ బోధపడుతున్నాయి. తాను గత పదిహేనేళ్ళుగా ఏమి చెబితే అది విని ఎలా చేయమంటే అలా చేసి కుక్కిన పేనుల మాదిరిగా ఉన్న పార్టీ నేతలు ఇపుడు ధిక్కార స్వరాలు వినిపించడం మమతను బేజారెత్తిస్తోంది తన మీద ఇంతటి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత సొంత నేతలలో ఉందని ఆమె కలలో కూడా ఊహించలేకపోయారు. అధికార దర్పంతో ఆమె తీసుకున్న నిర్ణయాలు చర్యలకు డూ డూ బసవన్నలుగా అంతా తలూపడమే ఆమె చూశారు కానీ ఇపుడు సీన్ సితార్ అవుతోంది. ఎనభై మంది ఎమ్మెల్యేలను నిన్నటికి నిన్న జరిగిన ఎన్నికల్లో గెలిపించుకుంటే అందులో డెబ్బై మంది దాకా గోడ దాటేసేలా ఉన్నారు. తాజాగా మమత మీటింగ్ కి ఎనిమిది మంది మాత్రమే హాజరయ్యారు అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు.

ఎంపీలంతా కాషాయంలోకి :

కాషాయం కట్టేయ్ బ్రదర్ అన్నట్లుగా మమతతో విసిగిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు లోక్ సభలో 28 మంది ఉంటే అందులో 23 మంది బై బై మమతా అనేస్తున్నారు. వారిలో ఏకంగా 20 మంది దాకా ఎంపీలు బీజేపీలో చేరేందుకు మంచి ముహూర్తం చూసుకుంటున్నారు అని ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. వీరే కాదు ఆ ముగ్గురూ మరో ఇద్దరూ వచ్చినా ఆశ్చర్యం అయితే లేదని అంటున్నారు. ఇక రాజ్యసభలో మమతా బెనర్జీ పార్టీకి 13 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో తొమ్మిది మంది కనుక వేరుగా మారి జట్టు కడితే వారిదే అసలైన తృణమూల్ కాంగ్రెస్ అన్న గుర్తింపు వస్తుంది. ఆ దిశగా కూడా వీర లెవెల్ లో ప్రయత్నాలు చేస్తున్నారు ధిక్కార ఎంపీలు. మొత్తానికి మమతకు ఎమ్మెల్యేలు రాజ్యసభ లోక్ సభ ఎంపీలు అంతా కలసి ఈ క్లిష్ట సమయంలో కష్ట కాలంలో బిగ్ హ్యాండ్ ఇస్తున్నారు అని అంటున్నారు.

అదే పెద్ద డౌట్ :

నిజానికి మమత పోకడలు అన్నీ నియంతృత్వం అన్నది అందులో వారికి ఎపుడో తత్వం బోధపడింది. కానీ సరైన ఆల్టర్నేషన్ లేకనే వారంతా వెయిట్ చేశారు. ఇపుడు బీజేపీ అక్కడ అధికారంలో ఉంది. అయిదేళ్ళ వరకూ తిరుగులేదు, ఆ మీదట బలం పుంజుకునే సీన్ అయితే మమతకు లేదని అంటున్నారు. దాంతో పాటుగా ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ మీద కూడా పీకల్లోతు కోపంతోనే ఎంపీలు ఎమ్మెల్యేలు గీత దాటేసి బయటకు పోతున్నారు అని అంటున్నారు. మమత నాయకత్వంలో మళ్ళీ పార్టీ సక్సెస్ అగుతుందందన్ని పెద్ద డౌట్ గా మారిందని అందుకే ఇలా గేట్ తోసుకుని బయటపడుతున్నారని అంటున్నారు.

ఏడు పదుల పైబడి :

మమతా బెనర్జీ వయసు 72 ఏళ్ళు. ఆమె మరో అయిదేళ్ల పాటు ఇదే తీరున ఈ విధంగా తన పార్టీని నిలుపుకుని బీజేపీతో కలబడే సీన్ ఉందా అన్నది బయట వారికి కాదు సొంత వారికే ధర్మ సందేహంగా ఉంది అని అంటున్నారు. ముమ్మారు అధికారంలో ఉన్న మమతకు మళ్ళీ చాన్స్ రాదని ఒకసారి మెచ్చిన బెంగాల్ జనాలు మరిన్ని చాన్సులు ఒకే పార్టీకి ఇవ్వడం అక్కడ పొలిటికల్ ట్రెండ్ అని గుర్తు చేస్తున్నారు పైగా బీజేపీ పట్టుదల బిగించే పట్టూ అన్నీ తెలిసిన మీదట మమతకు రాజకీయ వైభోగం కల్ల అని లెక్కలేసుకుని మరీ చెక్కేస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి మమతలో మునుపటి ఆవేశం తగ్గిపోతోంది, ఫైర్ కూడా చల్లబడుతోంది. కానీ చేతులు అయితే ఇప్పటికే కాలిపోయాయి, ఆకులు పట్టుకున్నా సుఖం లేదని అంటున్నారు.