Begin typing your search above and press return to search.

ముల్లు రవి రాజీనామా వెనుక అసలు కారణం ఇదేనా?

కాంగ్రెస్ సీనియర్ నేతగా సుపరిచితులైన మల్లురవి సంచలనంగా మారారు. ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరిస్తున్న ఆయన.. తన పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

By:  Tupaki Desk   |   24 Feb 2024 4:03 AM GMT
ముల్లు రవి రాజీనామా వెనుక అసలు కారణం ఇదేనా?
X

కాంగ్రెస్ సీనియర్ నేతగా సుపరిచితులైన మల్లురవి సంచలనంగా మారారు. ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరిస్తున్న ఆయన.. తన పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి రేవంత్ కు ఇచ్చారు. ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.

ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి హోదాలో ఉండి కూడా ముల్లు రవి రాజీనామాకు కారణం ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుపునకు దూరంగా ఉంటున్న ఆయన తాజాగా తన లక్ ను చెక్ చేసుకోవాలన్న ఆలోచనతోనే తాజా రాజీనామా వెనుక కారణంగా చెబుతున్నారు.

తెలంగాణలో మారిన కాంగ్రెస్ పరిస్థితిని అందిపుచ్చుకొని పూర్వ వైభవం కోసమే రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు. మరికొద్ది వారాల్లో వెలువడే సార్వత్రిక ఎన్నికల్లో నాగర్ కర్నూలు కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేయాలన్నది మల్లు రవి లక్ష్యమని చెబుతున్నారు. ఇందుకోసమే తన ప్రస్తుత పదవికి రాజీనామా చేసినట్లుగా చెబుతున్నారు. అయితే..ఆయన రాజీనామా లేఖపై ముఖ్యమంత్రి రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు చర్చగా మారింది.

ముఖ్యమంత్రి రేవంత్ చేతికి ఇచ్చిన రాజీనామా లేఖను ఆయన ఆమోదిస్తారా? లేదంటే తన దగ్గరే అలా ఉంచేసుకుంటారా? అన్నది మరో ప్రశ్న. రాజీనామా లేఖను తీసుకున్నరేవంత్.. ప్రస్తుతానికి మల్లు రవి రాజీనామాపై పెద్దగా స్పందించరని చెబుతున్నారు. నాగర్ కర్నూలు టికెట్ ను ఆయనకు ప్రకటించే అవకాశాలు ఎక్కువంటున్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన గెలుపు అవకాశాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. నాగర్ కర్నూలులో విపక్ష బీఆర్ఎస్ కు బలమైన అభ్యర్థి లేకపోవటం.. రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తున్న సానుకూలతల్ని మల్లురవి సొంతం చేసుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ కారణంతోనే ఆయన రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెప్పక తప్పదు.