Begin typing your search above and press return to search.

హాట్ టాపిక్... రేవంత్ రెడ్డి సలహాదారుతో మల్లారెడ్డి భేటీ?

ఈ సమయలో మాజీమంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజ్శేఖర్ రెడ్డి... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరెందర్ రెడ్డితో భేటీ అయినట్లు తెలుస్తుంది

By:  Tupaki Desk   |   7 March 2024 10:50 AM GMT
హాట్ టాపిక్... రేవంత్ రెడ్డి సలహాదారుతో మల్లారెడ్డి భేటీ?
X

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలొకి వచ్చినప్పటి నుంచీ రేవంత్ రెడ్డి దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇంతకాలం బీఆరెస్స్ ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడినవారిపైనా.. అవినీతి చేసినవారిపైనా.. రూల్స్ కు వ్యతిరేకంగా నడుచుకున్నవారిపైనా ఫుల్ గా కన్ సంట్రేషన్ చేశారనే చర్చ బలంగా నడుస్తుంది. దీంతో... తెలంగాణలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని అంటున్నారు.

ఆ సంగతి అలా ఉంచితే... మాజీ మంత్రి మల్లారెడ్డికి అధికారులు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి తన కాలేజీలకు రహదారిని నిర్మించారని చెబుతూ... అధికారులు ఆ రోడ్డును తవ్వేసి, ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సమయంలో ఈ రోడ్డు లేకపోవడం వల్ల విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలు మల్లారెడ్డి చెబుతుంటే... అసలు ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలంలో రోడ్డును ఎలా నిర్మిస్తారంటూ అధికారులు ఫైరవుతున్నారు!

మరోపక్క మల్లారెడ్డి అల్లుడు, మల్కాజిగిరీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికీ తెలంగాణ అధికారులు షాకిచ్చారు. ఇందులో భాగంగా... హైదరాబాద్‌ అవుట్ కట్స్ దుండిగల్‌ లోని చిన్న దామరచెరువు ఎఫ్‌.టీ.ఎల్‌ బఫర్‌ జోన్‌ లో ఉన్న కాలేజీలకు సంబంధించిన రెండు శాస్వత భవనాలు, ఆరు తాత్కాలిక షెడ్లను అధికారులు కూల్చేశారు. 8.24 ఎకరాల చెరువును ఆక్రమించి కాలేజీ రోడ్లు, భవనాలు నిర్మించినట్లు గతంలోనే నోటీసులు ఇచ్చిన అధికారులు.. ఇప్పుడు వాటిని కూల్చేశారు!

ఈ సమయలో మాజీమంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజ్శేఖర్ రెడ్డి... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరెందర్ రెడ్డితో భేటీ అయినట్లు తెలుస్తుంది. ఇలా... రాజశేఖర్ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలలో అక్రమ నిర్మాణాలు జరిగాయని చెబుతూ వాటిని అధికారులు కూల్చేస్తున్న నేపథ్యంలో.. వీరిద్దరూ సీఎం సలహాదారుని కలిశారనే కథనాలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి! అయితే... వీరిద్దరూ సీఎం సలహాదరుని కలిసింది వాస్తవమేనా.. అది ఇందుకేనా.. లేక మరెందుకైనానా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది!